బీసీఎస్‌బీఐ.... బ్యాంకింగ్ కోడ్‌లు, ప్రమాణాలను బ్యాంకులు అనుసరిస్తున్నాయా లేదా అన్న అంశాన్ని పర్యవేక్షించే స్వతంత్ర సంస్ధ. సాధారణంగా బ్యాంకులు కస్టమర్ల అనుమతి పొందకుండా యాడ్ ఆన్ క్రెడిట్ కార్డులు జారీ చేయడం, వారి కొనుగోళ్లను ఈఎంఐల క్రింద మార్చడం లాంటివి చేస్తుంటాయి.
దీని ద్వారా కస్టమర్లకు తెలియకుండానే బ్యాంకులు వారి క్రెడిట్ కార్డులపై బిల్లింగ్ వేస్తుంటాయి. ఈ విషయం కస్టమర్లకు తెలియక తమకు వచ్చిన బిల్లులను చెల్లిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వ్వవహరించాల్సిన తీరుపై రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
వాటన్నింటినీ పరిశీంచే సంస్ధే బీసీఎస్‌బీఐ. బ్యాంకింగ్ కోడ్‌లు, ప్రమాణాల బోర్డు 2014 జనవరిలో జారీ చేసిన విధివిధానాల ప్రకారం కస్టమర్లకు బ్యాంకు కట్టుబాటు ప్రమాణాల్లో కూడా రక్షణ ఉండే విధంగా కొన్ని అంశాలను పొందుపరిచింది. అవేంటో చూద్దాం.

అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు ఇవ్వరాదు
ఏ బ్యాంకు కూడా కస్టమర్ లిఖితపూర్వకమైన అనుమతి కోరందే, క్రెడిట్ కార్డులు, యాడ్ ఆన్ కార్డులు జారీ చేయకూడదు. ఒకవేళ లిఖితపూర్వకమైన అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు పంపి, దాన్ని యాక్టివేట్ చేసి దానిపై ఏవైనా చార్జీలు విధించినట్లయితే, బ్యాంకు ఆ సొమ్మును ఆ చార్జీలను వెనక్కి తీసుకోవడమే కాకుండా అందుకు రెట్టింపు మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు ఇవ్వరాదు
యాడ్ ఆన్ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు అడక్కుండానే రుణాలు అందించడం లేదా అదనపు రుణ పరపతి కల్పించడం వంటివి కూడా చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లైయితే, ఆ కస్టమర్ అభ్యంతరం ప్రకటిస్తే దాన్ని మంజూరు చేసిన ఆర్థిక సంస్థ ఆ రుణ సదుపాయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు అందుకు అయిన మొత్తాన్ని, జరిమానాతో సహా కస్టమర్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు ఇవ్వరాదు
రుణం లేదా క్రెడిట్ సదుపాయానికి కస్టమర్ లిఖితపూర్వకంగా అంగీకరించి ఉండవచ్చు. ఒకవేళ ఎలక్ర్టానిక్ రూపంలో ఎంఐటిసి నిబంధనలు చదివి లావాదేవీని సరైనదిగా చూసి ఆ డిజిటల్ రికార్డును కస్టమర్ అనుమతికి ఆధారంగాను, బ్యాంకు అంగీకారంగాను పరిగణిస్తారు.

అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు ఇవ్వరాదు
ఇలాంటి అనుమతులేవీ లేకుండా బ్యాంకు కార్డు పంపించి దానిపై చార్జీలు విధించినట్టయితే కస్టమర్లు దానిపై సంబంధిత బ్యాంకును సంప్రదించవచ్చు లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications