భారతదేశంలో బంగారం ధరలు మార్పునకు దారి వివిధ కారణాలు ఉన్నాయి. నిజానికి, ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన రెండు కారణాలు మాత్రం ఇవే.
* అంతర్జాతీయ స్ధాయిలో బంగారం ధరలు
* కరెన్సీ అస్థిరత
అంతర్జాతీయ స్ధాయిలో బంగారం ధరలు:
భారత్‌లో బంగారం ధరలు నిలకడగా ఉండకపోవడానికి గల కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటమే. భారత్‌లోని ప్రజలకు బంగారంపై మక్కువ ఎక్కువ. కాబట్టి బంగారం దిగుమతి ఎక్కువగా చేసుకుంటారు. దీంతో అంతర్జాతీయ స్ధాయిలో బంగారం ధరలు పెరిగితే, భారత్‌లో బంగారం ధరలు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి.

ఉదాహారణకు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ తగ్గినట్లైతే, బంగారం ధర ఆటోమాటిక్‌గా పెరుగుతుంది. అంతర్జాతీయ స్ధాయి మార్కెట్లో ఈరోజు బంగారం ఔన్స్ ధర $1,200కు కంటే తక్కువగా ట్రేడ్ అవుతుంది కాబట్టి డాలర్ విలువ పెరిగింది.
భారత్‌లో చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెడుతుంటారు. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. బంగారంలో పెట్టుబడులు అనేవి గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌ల) రూపంలో జరుగుతాయి. గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులనేవి ఎలక్ట్రానిక్ రూపంలో జరుగుతాయి.
ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా, భారత్‌లు టాప్ స్ధానంలో ఉన్నాయి. భారత్ ప్రజలను భౌతిక బంగారం కొనుగోలు నుంచి మాన్పించాలని కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను కూడా ప్రవేశపెట్టింది.
2015 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి సావరిన్ గోల్డ్ బాండ్‌లపై వడ్డీ రేటుని పెంచిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం భౌతిక బంగారాన్ని కొనుగోలు నుండి పెట్టుబడిదారులు మాన్పించడానికేనని అంటున్నారు.
కరెన్సీ అస్థిరత:
బంగారం ధర పెరగడంలో కరెన్సీ అస్థిరత కూడా ముఖ్య భూమికను పోషిస్తుంది. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ తగ్గుతున్నట్లైతే, బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. దీనిని బట్టి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు అంతర్జాతీయ బంగారం ధరలపై ఓ కన్నేసి ఉండటం మంచింది. దీనితో పాటు రూపాయి అస్థిరతను కూడా పరిశీలిస్తే మంచిది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications