డబ్బు వృద్ధి చెందాలంటే పాటించాల్సిన నియమాలు..!
మానవుడు ఆశాజీవి. ఎంత సంపాదించిన ఇంకా సంపాదించాలనే కోరికతో ఉంటాడు. కాబట్టి మీరు సంపాదించిన డబ్బు వృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? దీని కోసం ముందుగా మీరు సరైన ఆర్ధిక ప్రణాళికలు వేసుకోవాలి. లేదంటే లక్ష్యం చేరడానికి ఆలస్యం అవడంతో పాటు, అనుకున్న పనులు సక్రమంగా జరగవు.
అవసరానికి మించిన ఖర్చు:
సంపాదించేది ఖర్చు పెట్టడానికేనని అంటుంటారు. కాని ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. రేపటి అవసరాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. కానీ, ఎలాంటి అవసరాలు వచ్చినా ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిద్ధంగా ఉండాలి. మీరు సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇక ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల రాకతో డబ్బు పొదుపు చేయడంలో ప్రజలు నియంత్రణ కోల్పోయారని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డుల ద్వారా వాయిదా పద్ధతి ద్వారా కొనుగోలు చేసే వెసులుబాటు వచ్చింది. దీంతో ఖర్చు ఎక్కవైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
దీని వల్ల కొన్ని నెలలు పాటు అది అప్పుగా ఉంటున్న సంగతిని మరిచిపోతున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. మీకు నిజంగా అవసరం లేకున్నా కొన్ని సందర్భాల్లో కొనుగోలు చేస్తుంటారు. అలా కాకుండా మార్కెట్లో దొరికే ధరకన్నా తక్కువకు లభిస్తుంది అనుకున్నప్పుడే కొనుగోలు చేస్తే మంచిది.

ఆర్ధిక విషయాల్లో అవగాహన పెంచుకోండి:
సాధారణంగా ఆర్ధిక విషయాలు ఎక్కువగా మగవారే చూసుకుంటుంటారు. మహిళలు, పిల్లలు అది మాకు సంబంధం లేని విషయంగా వ్వవహరిస్తుంటారు. ప్రస్తుతం మారుతున్న పరిస్ధితులను బట్టి అన్నింటిపైనా అవగాహన పెంచుకుంటే మంచిది.
మీ భార్యకు కూడా మీ ఖర్చుల వివరాలను తెలియజేయండి. ఎందుకంటే భార్యలకే ఆర్ధిక విషయాల గురించి సరైన అవహగాన ఉంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు వారు కంగారు పడకుండా ఉంటారు.
వైవిధ్యమైన పెట్టుబడులు ఎంచుకోండి:
డబ్బు సంపాదిస్తున్నప్పుడు నష్టభయం తక్కువగా ఉండే ఈక్వీటీ ఆధారిత పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు పెట్టుబడుల గురించి సమీక్షించుకోండి.


Click it and Unblock the Notifications