ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పొదుపు చేయాలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన అవసరాలను తీర్చుకుంటూనే మిగిలిన సొమ్మును భవిష్యత్తుకోసం దాచిపెట్టడం.. అందుకోసం సాంప్రదాయంగా వస్తున్న బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్లు, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాలు.. ఇలా ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి.
వీటన్నింటిలోకి నష్ట భయం తక్కువగా ఉండి, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే పథకాల్లో పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాలు ఎంతో ఉత్తమం. కాబట్టి పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం గురించి తెలుసుకుందాం.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో తొమ్మిది శాతం వడ్డీ లభిస్తుంది. కనీసం వెయ్యి రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా మూడులక్షల రూపాయాలు, జాయింట్‌గా అయితే ఆరు లక్షల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఏడాది తరువాత పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
ఏడాది తరువాత పెట్టుబడి ఉపసంహరించుకుంటే డిపాజిట్ సొమ్ములో ఐదు శాతం తగ్గించి ఇస్తారు. మూడేళ్ల తరువాత అయితే ఎలాంటి కోత లేకుండా డిపాజిట్ సొమ్మును తిరిగి ఇస్తారు. చివరిదాకా డిపాజిట్ ఖాతాలో ఉంచితే వడ్డీతోపాటు పది శాతం బోనస్‌గా లభిస్తుంది. గడువుకు ముందే తీసుకుంటే బోనస్ ఉండదు. సెక్షన్ 80ఎల్ కింద ఈ పథకంలో ఉంచిన పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

రిటైర్డ్ ఉద్యోగులకు, పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్న వారికి ఇది అనుకూలమైన పధకంగా చెప్పవచ్చు. అదేవిధంగా పెద్ద మొత్తంలో పొదుపుచేసి ప్రతి నెలా రాబడి అందుకోవాలని భావించే వారితోపాటు పెన్షన్ సదుపాయంలేని వారికి ఇది అనుకూలమైన పథకం.
ఏమిటీ ఎంఐపీ?
నెలసరి ఆదాయ పథకాలు అనగానే నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయం అందించే పథకాలే అని భావిస్తాం. ఇవీ అలాంటివే అయినప్పటికీ సంప్రదాయ నెలసరి ఆదాయ పథకాలకూ వీటికీ చాలా వ్యత్యాసం ఉంది. తపాలా పొదుపు పథకాలు, బ్యాంకు డిపాజిట్ల లాంటి డెట్ పథకాలల్లో వచ్చిన వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎంఐపీలతో పన్ను పరంగా కలిసొస్తుంది. ఇందులో వచ్చిన డివిడెండ్‌కు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
నామిని సౌకర్యం:
పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో అకౌంట్ తెరిచే సమయంలోనే మీ నామిని పేరును ప్రకటించే వెసులుబాటు ఉంది.
మెచ్యూరిటీ:
డిసెంబర్ 1, 2011 నుంచి ఈ పథకాలకు మెచ్యూరిటీ కాలపరిమితిని ఐదేళ్లు చేశారు.
పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో పెట్టుబడులు పెట్టొచ్చా?
పన్ను పరంగా కలిస్తాయి. పన్ను వర్తించే ఆదాయం గరిష్ఠంగా ఉండి, పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను వర్తించకుండా ఉండాలని భావించేవారు ఇలాంటి పథకాలను ఎంచుకోవచ్చు. మీకు క్రమం తప్పకుండా ఆదాయం రావాలనుకొని, ఈ ఆదాయం మీదే ఆధారపడి జీవనం సాగించాలనుకుంటే మాత్రం ఎంఐపీలు ఏ మాత్రం ఉపయోగపడవు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications