సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు మనలో చాలా మంది అప్పులు చేసి మరీ ఇంటిని నిర్మించుకుంటారు. ఇంటి నిర్మాణం తర్వాత ఇల్లు అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో అత్యంత ఖరీదైన వస్తువులతో అలంకరిస్తుంటారు.
అందంగా నిర్మించుకున్న ఇంటికి మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోరు. నేపాల్‌లో భూకంపం సంభవించడం వల్ల అక్కడి పురాతన భవనాలు, పెద్ద పెద్ద భవంతులు నేలమట్టమయ్యాయి. ఇలాంటి సహజ విపత్తుల సంభవించినప్పుడు ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే కొంత వరకు లాభపడొచ్చు.
కొన్ని ఇన్సూరెన్స్ సంస్ధలు భూకంపం, సునామీ, వరదలు లాంటి సహజ విపత్తులతో పాటు ఇంటిలోని ఖరీదైన వస్తువులకు కూడా పరిహారాన్ని చెల్లిస్తాయి. కాబట్టి హోం ఇన్సూరెన్స్ పాలసీని కోనుగోలు చేసే ముందు ఇలాంటి వాటికి పరిహారం లభిస్తుందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.
బ్యాంకుల నుంచి హోం లోన్ తీసుకుంటున్నప్పుడు, మీ ఇంటికి బ్యాంకులు ఎలాంటి ఇన్సూరెన్స్‌ని ప్రతిపాదించవు. సాధారణ హోం ఇన్సూరెన్స్‌లో సహజ విపత్తులు సంభవించినప్పుడు పరిహారం ఇవ్వవు. అందు కోసం ప్రత్యేకించి హోం ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాల్సి ఉంది. అవేంటో తెలుసుకుందాం?

సహజ విపత్తుకి వ్యతిరేకంగా భీమా:
ఈ తరహా ఇన్సూరెన్స్‌లో నిప్పంటుకోని ఇల్లు తగలబడటం, భూకంపాలు, సైక్లోన్, తుఫాన్, ఇల్లు తిరగబడటం లాంటి వాటికి పరిహారం చెల్లిస్తారు.

ఐసీఐసీఐ లాంబోర్డ్ హోం ఇన్సూరెన్స్:
ఐసీఐసీఐ లాంబార్డ్ హోం లోన్ ఇన్సూరెన్స్ ఇంటి నిర్మాణం, ఇంటిలోని వస్తువలు లాంటి రెండింటీకి వర్తిస్తుంది. అంతేకాదు నిప్పంటుకోని ఇల్లు తగలబడినా లేదా ఇంట్లో దోపిడీ, దొంగతనం చేయబడ్డా వర్తిస్తుంది. ఇక కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే బట్టలు, గృహోపకరాణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఫర్నీచర్, జ్యూయలరీ, పెయింటింగ్ లాంటి వాటికి కూడా వర్తిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ ఈర్గో హోం ఇన్సూరెన్స్:
ఈ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా మీ ఇల్లు తుఫాన్, సైక్లోన్, నిప్పంటుకోవడం, సునామీ, వరదలు, భూకంపాల్లో నేలమట్టమైతే పూర్తి పరిహారం లభిస్తుంది.

టాటా ఏఐజీ హోం ఇన్సూరెన్స్:
ఈ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఇంటికి నిప్పంటుకోవడం, భూకంపాల వల్ల ఇల్లు దెబ్బతినడం, సైక్లోన్, తుఫాన్, వరదలు, గొడవలు, హర్తాళ్లు, స్టైక్‌లు లాంటి వాటిలో మీ ఇల్లు దెబ్బతింటే పరిహారం చెల్లిస్తారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications