ఇంటి ధరలు తగ్గే అవకాశం ఉందా...?
సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అందుకు మన చుట్టూ ఉన్న పరిస్ధితులు కూడా అనుకూలించాలి. ముఖ్యంగా ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జేట్‌పై కూడా ఇంటి ధరలు తగ్గుదల అనేది ఆధారపడి ఉంటుంది.
గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ స్ధిరాస్తి రంగంపై సానుకూల ప్రభావం ఎంత మాత్రం చూపలేదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాతిక బేసిస్ పాయింట్లను తగ్గించడం వల్ల మార్కెట్ లో ఎలాంటి సానుకూల ప్రభావం కనపడ లేదు. ఇలాంటి అంశాల కారణంగా, ఇళ్ల ధరలు తగ్గుతాయని వేచి చూసే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా పెరిగింది.
అయితే గత ఏడాదిలో కొత్త ప్రాజెక్టులు ఆరంభం కాకపోడవం కూడా సొంతింటి కలను సాకారం చేసుకుందామనకునే వారి పాలిట శాపంగా మారింది. అంతక ముందు ఏడాదితో పోలిస్తే 48 శాతం తగ్గిందని పేర్కొంది.

ఇటీవలే వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గిస్తుందని కొనుగోలుదారులు వేచి చూసారు. కాకపోతే, ఎలాంటి తగ్గింపుల్లేవని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించడంతో బిల్డర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఏదో 25 బేసిస్ పాయింట్లు తగ్గించినంత మాత్రాన మార్కెట్లో సానుకూలత ఏర్పడదని, సుమారు 200 పాయింట్లు తగ్గితే తప్ప కొనుగోలు దారుల్లో సానుకూల దృక్పథం రాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముగింపు: బడ్జెట్లో ఇళ్ల కొనుగోలుదారులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇంటి ధరలు తగ్గే అవకాశం లేదనంటున్నారు. అయితే అధికంగా ఉన్న గృహరుణాల వడ్డీ రేటు మాత్రం తగ్గిందని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications