విదేశాలకు వెళ్తున్నారా... అయితే వీటి గురించి తెలుసుకోండి?
ఒకప్పుడు విదేశాలకు వెళ్లడమంటే చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు మధ్యతరగతి వారు కూడా తమ వీలును బట్టి విదేశాల్లో పర్యటిస్తున్నారు. విదేశాల్లో పర్యటించే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం.
మారకపు విలువ:
మొదటగా మీరు ఏదేశానికి వెళ్తున్నారో అక్కడ వినియోగించే కరెన్సీ గురించి తెలుసుకోవాలి. మన రూపాయితో మారకపు విలువ ఎంత ఉంది అనే విషయం తెలుసుకోవాలి. సాధారణంగా విదేశీ నగదుని మన నగదు లోకి మార్చుకోవడాన్ని 'కొనుగోలు ధర' అంటారు. అదే మన నగదును విదేశీ నగదుగా మార్చకునేటప్పుడు 'అమ్మకపు ధర' అని వ్యవహరిస్తుంటారు. విదేశాల్లో నగదు మార్చుకోవడానికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా పాస్ పోర్టు తీసుకెళ్లాలి.

ఎంత నగదు తీసుకెళ్లొచ్చు:
ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లే సందర్భంలో ఎంత నగదు తీసుకెళ్లవచ్చనేది తెలుసుకుందాం. వ్యక్తిగత పర్యటనల కోసం 10,000, విద్యార్ధులు 1,00,000... వ్యాపారస్తులు 25,000, వైద్య చికిత్స కోసం వెళ్లేవారు 1,00,000 అమెరికన్ డాలర్ల చొప్పున అధీకృత డీలర్ల నుంచి పొందేందుకు వీలుంది.
అధీకృత కేంద్రం అంటే ఏమిటీ?
విదేశాల్లో మన నగదును విదేశీ నగదుగా మార్చుకోవడానికి ఉపయోగపడే కేంద్రాలను అధీకృత కేంద్రాలు అంటారు. అధీకృత కేంద్రలతో పాటు, బ్యాంకుల్లో కూడా మన నగదుని విదేశీ నగదుగా మార్చుకోవచ్చు. కాకాపోతే వీటికి అధీకృత కేంద్రాలు, బ్యాంకులు కొంత రుసుముని వసూలు చేస్తాయి.
విదేశాలకు వెళ్లేటప్పుడు ట్రావెల్ కార్డు వాడితే మంచిది:
విదేశాలకు వెళ్లేటప్పుడు "ట్రావెల్ కార్డు" ఉపయోగించడం ఉత్తమం. ప్రస్తుతం దేశంలో అనేక ట్రావెల్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మన అవసరాన్ని బట్టి, నగదును నింపుకోవచ్చు. ట్రావెల్ కార్డు వల్ల ఉపయోగాలు, దాని ద్వారా నిర్వహించే లావాదేవీలకు విధించే రుసుములను ముందుగా తెలుసుకుంటే మంచిది.


Click it and Unblock the Notifications