కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రికరింగ్ డిపాజట్లపై వచ్చే వడ్డీకి కూడా టీడీఎస్ కట్టేలా ప్రతిపాదనను తెచ్చారు. అంతే కాదు టైమ్ డిపాటిట్స్ నిర్వచనమే మారిపోయింది. దీంతో టైమ్ డిపాజిట్స్‌కి వర్తించే అన్ని నియమాలు రికరింగ్ డిపాజట్లకూ వర్తించనున్నాయి.
ఈ రెండు డిపాజిట్లకు మధ్య ఉన్న తేడా టీటీఎస్. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ. 10,000లకు మించినట్లేతే టీడీఎస్‌ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి కూడా ఇప్పుడు టీడీఎస్‌ను ప్రభుత్వం వసూలు చేయనుంది.
అయితే ఇందులో ఒక వెసులుబాటుకి ప్రభుత్వం కల్పించింది. రికరింగ్ డిపాజిట్ మీద బ్యాంకులో ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లైతే టీడీఎస్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ట్యాక్స్ రిటర్న్స్ ఫైలు చేసే సమయంలో ఆదాయంపై వచ్చిన వడ్డీని విడిగా చూపించాలి.

రికరింగ్ డిపాజిట్లపై టీడీఎస్‌ను ఏవిధంగా లెక్కిస్తారు?
రికరింగ్ డిపాజిట్ అనేది ఒక క్రమ పద్ధతిలో ప్రతి నెల చెల్లించే నెలవారీ మొత్తం. ఉదాహరణకు మీరు ప్రతి నెలకు రూ. 10,000 చొప్పున 24 నెలలు పాటు చెల్లిస్తున్నారని అనుకుందాం. రెండు సంవత్సరాలు గడిచే సరికి మీరు చెల్లించిన మొత్తం రూ. 2, 40, 000.
ప్రతి సంవత్సరానికి మీరు రూ 12,000 వడ్డీని పొందుతున్నట్లైతే, ఎలాంటి ట్యాక్స్ వసూలు చేయబడదు. తాజాగా, బడ్జెట్ ప్రకారం బ్యాంకులు మీ ఆదాయంపై పొందిన వడ్డీలో 10 శాతం ట్యాక్స్ తగ్గిస్తారు. ఇక్కడ మీరు టీడీఎస్‌ను నిరోధించుకునే మార్గం లేదు.
సరైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం:
ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సమానంగా రికరింగ్ డిపాజిట్లపై ప్రభుత్వం తెలివైన నిర్ణయం తీసుకుంది. రెండు డిపాజిట్లను వేరు చేసి ఒక దానికి టీడీఎస్, మరొక దానికి టీడీఎస్ మినహాయింపు ఇవ్వడం సరైనది కాదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications