మెడిక్లైయిం పొందడం ఎలా?
ప్రస్తుత రోజుల్లో కార్పోరేట్ వైద్యం చేయించుకోవాలంటే చాలా ఖరీదుతో కూడుకున్న పని. ఇందు కోసం ఎక్కువ మంది ఆరోగ్య బీమా వైపు మొగ్గు చూపుుతన్నారు. అయితే క్లైయింల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

నిబంధనలు పాటించలేదని పరిహారాన్ని నిలిపేస్తున్నారు. క్లైయింను తిరస్కరిస్తుంటారు. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లైయిం పరిహారం అందుకోవాలంటే ఏం చేయాలో చూద్దామా?
మెడిక్లైయిం:
ఆసుపత్రిలో చేరితే చేతి నుంచి ఎలాంటి సోమ్ము పెట్టకుండా ఆదుకునేదే ఈ పాలసీ. బీమా సంస్దే ధర్డ్ పార్టీ అడ్మినిస్టేటర్ (టీపీఏ) ద్వారా ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తుంది. ఇందులో మీరు తీసుకున్న పాలసీకి సంబంధించిన టీపీఏ నెంబర్ కార్డు మీదే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్యాష్‌లెస్ చికిత్సకు బీమా కంపెనీ అనుమతించకపోవచ్చు.
ఇలాంటి సందర్భంలో చికిత్సకైమ ఖర్చు మొత్తాన్ని మనమే భరించి, ఆ తర్వాత అవసరమైన బిల్లులు, పత్రాలు సమర్పించి బీమా సంస్ధ నుంచి సొమ్ము రాబట్టుకోవాలి. కొన్ని మెడిక్లైయిం పాలసీలో కొన్ని జబ్బులకు మొదటి ఏడాది కవరేజి వర్తించదు.
ఉదాహరణకు హెర్నియా, ఫైల్స్, సైనసైటిస్. ప్రస్తుత రోజుల్లో నగదు రహిత సదుపాయం దాదాపు అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది.
అయితే, ముందుగా ఈ విషయాన్ని టీపీఓతో ధ్రువీకరించుకోవడం తప్పనిసరి. మీకు శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్ చెప్పిన వెంటనే టీపీఏకు తెలియజేస్తే మంచిది. పరిహారం కోసం మీరు సమర్పించే పత్రాలు అసంపూర్తిగా ఉండకూడదు. అన్ని రశీదులను టీపీఏకు అందజేయండి. అప్పుడే మీ పరిహారంలో పూర్తి మొత్తాన్ని పొందగలుగుతారు.


Click it and Unblock the Notifications