ఇన్సూరెన్స్ పాలసీని రద్దు అయితే ఏం చేయాలి...?
సాధారణంగా మనం కొనుగోలు చేసిన వస్తువు ఏదైనా ఉపయోగపడదని తెలిసినప్పుడు, తిరిగి ఇచ్చేయడానికి ప్రయత్నిస్తుంటాం. మరి మనం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ నచ్చకపోతే ఏం చేయాలో చూద్దాం.
మనదేశంలో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు ఏజెంట్ల ద్వారానే తీసుకుంటారు. కొన్నిసార్లు తెలిసో తెలియకో తమకు సరిపోని పాలసీని తీసుకొని ప్రీమియం చెల్లిస్తుంటారు. తీరా విషయం తెలుసుకున్న తర్వాత దానిని వదిలించుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు.
అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మొదటి 15 రోజుల్లో పాలసీని వాపస్ ఇవ్వడానికి వీలు కల్పిస్తున్నాయి. రెండు మూడు ప్రీమియాలు చెల్లించాక అప్పుడు అందులోని విషయాలు తెలుసుకోని, ఉపయోగం లేదని ఆ తర్వాత ప్రీమియం చెల్లించడం మానేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పాలసీ రద్దవుతోంది.

* రద్దు అయిన పాలసీని తిరిగి ప్రారంభించాలంటే ఇప్పటివరకూ బాకీ ఉన్న ప్రీమియాలను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.
* ప్రీమియం చెల్లించాల్సిన గడువు తర్వాత ఆరు నెలల్లోగా కేవలం వడ్డీతో కలిపి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
* దీని కోసం ఎలాంటి దరఖాస్తులు గానీ, వివరాలు కానీ సమర్పించాల్సిన అవసరం లేదు.
* మనం తీసుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి, కొన్ని సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది.
* సాధ్యమైనంత వరకూ కొత్త పాలసీని తీసుకోవడం కన్నా పాత పాలసీని కొనసాగించడమే మేలు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ప్రీమియం అధికం అవుతుంది.
* సాధారణంగా ఇన్సూరెన్స కంపెనీలు తమ పాలసీదార్లకు ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాల రూపంలో, ఈ మెయిళ్ల ద్వారా ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన వివరాలు పంపిస్తుంటారు.
* కాబట్టి మీ అడ్రస్ మారిన తరుణంలో ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం ఎంతో మంచిది.
* పాలసీని డైరెక్టుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లించే ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీంతో ప్రీమియం చెల్లించే తేదీన డబ్బు నేరుగా బ్యాంకు ఖాతా నుంచే ఇన్సూరెన్స్ కంపెనీకి సొమ్మ జమ అవుతుంది.


Click it and Unblock the Notifications