సొంతిటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే చాలా మంది దగ్గర డబ్బులు లేని పక్షంలో ఇంటి రుణాన్ని ఆశ్రయిస్తుంటారు. మార్కెట్‌లో చాలా కంపెనీలు, బ్యాంకులు ఇంటి రుణాన్ని అందిస్తున్నాయి.
ఐతే వీటిలో మనకు సరిపడ సరైన ఇంటి రుణాన్ని ఎంచు కోవడం ఎలా? అనేది తెలుసుకుందాం. ఇందు కోసం పాఠకులకు ప్రత్యేకించి ఇంటి రుణానికి సంబంధించిన కొంత అవగాహన అవసరం.

పర్సంటేజిని సరి చూసుకోవాలి
ఇంటి రుణాన్ని అందిస్తున్న కంపెనీలు లేదా బ్యాంకులు ఎంత పర్సంటేజికి రుణాన్ని అందిస్తున్నాయనే విషయంపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. మీరు సర్వే చేసిన తర్వాత ఏ కంపెనీ నుంచి రుణం తీసుకునే దానిపై స్పష్టతకు రావాలి. కొంత మొత్తంలో మీ వద్ద డబ్బు ఉన్నప్పుడు డౌన్ పేమెంట్ కట్టి, మిగతా నగదు కోసం బ్యాంకులను ఆశ్రయించడం మంచింది. తీసుకున్న రుణాన్ని ఈఎంఐగా మలుచుకునే వెసులుబాటు ఉందా లేదా కూడా ముందే తెలుసుకుంటే మంచింది.

వడ్డే రేటు, ప్రాసెసింగ్ ఫీజు, పేమెంట్ చార్జీలు తెలుసుకోవాలి
ఇంటి రుణంపై వివిధ బ్యాంకులు లేదా పైనాన్స్ సంస్ధలు రకరకాలైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈఎంఐలు చెల్లించేందుకు వినియోగదారులకు వీలుగా ఉందనే విషయాన్ని ముందుగా తెలుసుకోండి. బ్యాంకులు, పైనాన్స్ సంస్ధలకు మధ్య ప్రాసెసింగ్ ఫీజు, పేమెంట్ ఛార్జీల్లో చాలా తేడా ఉంటుంది.

తక్కువ సమయంలో లోన్ ఇచ్చే సంస్ధలను ఎంచుకోండి
ఇంటి రుణం అనేది ఎక్కువ సమయంతో కూడుకున్న విధానం. మీకు సంబంధించిన ఇన్‌కమ్ స్టేట్‌మెంట్స్‌తో పాటు ఇంటి డాక్యుమెంట్స్‌ను అందజేయాల్సి ఉంటుంది. లోన్ మంజూరుకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీరు తక్కువ రిస్క్‌తో పాటు, తక్కువ సమయంతో మీరు ఋణం అందించేందుకు సరైన సంస్ధను ఎంచుకోండి.

అందుబాటులో ఉన్న హోం లోన్ వడ్డీ రేట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ .75 లక్షల వరకు రుణాలు కోసం 10.15-10.65 శాతం పరిమిత కాలానికి ఫ్లోటింగ్ వడ్డీ రేటు తగ్గింది. ఐతే రూ. 75 లక్షలకు పైగా రుణాల కోసం 10.50-11 శాతానికి తగ్గించింది. జూన్ 2014 నాటికి ఐసీఐసీఐ బ్యాంకు 10.15 శాతానికి హోం లోన్స్‌ను తగ్గించింది. జీతం తీసుకునే ఉద్యోగులకు సైతం రూ. 75 లక్షలకు లోబడి రుణం తీసుకునేవారికి ప్లోటింగ్ రేటు లోన్స్ తగ్గించింది.

ఇంటి రుణాల ప్రత్యేక పథకాల గురించి తెలుసుకోండి
కొన్ని బ్యాంకులు ప్రత్యేక రాయితీని పథకాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు, భారతదేశం స్టేట్ బ్యాంక్ మహిళలకు రు .75 లక్షలు పైన కోసం రు .75 లక్షల 10.10 శాతం మరియు 10.25 శాతం రాయితీని రేటు వద్ద అప్పు అందిస్తుంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ 30 లక్షల రుణం కోసం 10.50 శాతం వద్ద మరియు సీనియర్ పౌరులు కోసం 5 సంవత్సరాల వరకు ఇంటి రుణం అందిస్తుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications