న్యూఢిల్లీ: గత నెలలో బేటీ బచా వో.. బేటీ పఢావో ఉద్యమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ సుకన్య సమృద్ధి యోజనను హర్యానాలోని పానిపట్ జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆడపిల్లల పట్ల వివక్షను అంతం చేసి లింగ అసమానతలను రూపుమాపాలనే నినాదంలో ఈ పథకం ముందుకెళ్తుంది.
ఆడ పిల్లలకు ప్రత్యేక ఖాతాలు తెరవడం వల్ల ఆర్థిక సాధికారత లభిస్తుందని, తద్వారా వారిని మగ పిల్లలతో సమానంగా సంరక్షించేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 9.1 శాతం వడ్డీ లభించే ఈ ఖాతాలో జమ చేసుకున్న సొమ్ముకు ఆదాయపన్ను మినాహాయింపు కూడా ఉంది.
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఏయే బ్యాంకుల్లో తెరవచ్చు?
తపాలా కార్యాలయాల్లో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ వెయ్యి రూపాయాల కనీస డిపాజిట్‌తో పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలుంది. ఏయే బ్యాంకుల్లో ఈ ఖాతాలను తెరవచ్చో చూద్దాం.

1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) బరోడా బ్యాంక్
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) బ్యాంక్ ఆఫ్ ఇండియా
5) కెనరా బ్యాంక్
6) యూకో బ్యాంక్
7) యునైటెడ్ బ్యాంక్
8) ఆంధ్రా బ్యాంక్
9) అలహాబాద్ బ్యాంకు
10) ఇండియన్ బ్యాంక్
11) కార్పొరేషన్ బ్యాంక్
12) సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా
13) ఐడిబిఐ బ్యాంక్
14) దేనా బ్యాంక్
సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ వల్ల ప్రయోజనాలు:
ఈ పథకం కింద ఆడ పిల్ల తల్లితండ్రులు తమ పదేళ్ల లోపు వయస్సు గల కుమార్తె ల పేరిట బ్యాంకు ఖాతా తెరవొచ్చు. తల్లితండ్రులు ఈ ఖాతాలో రూ.1,000 మొదలుకొని లక్షన్నర రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ ఖాతాలో జమ చేసిన డబ్బుకు ఇతర పథకాల కన్నా బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.
ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 21 సంవత్సరాల నగదు వెనక్కి తీసుకునేవీలుండదు. ఒక వేళ 18 ఏళ్లు వయసొచ్చిన తర్వాత అమ్మాయి వివాహం కోసం కానీ, చదువుల కోసం కానీ జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
తొలి విడతలో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో 'సుకన్య' ఖాతాలు తెరుస్తారు. ఈ వంద జిల్లాలలో హర్యానా రాష్ట్రంలోని 12 జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కోసం కేంద్రం రూ. వంద కోట్ల మూలధనం కేటాయించింది. ఈ పథకానికి సినీ నటి మాధురి దీక్షిత్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications