పెట్టుబడి కోసం బంగారం కొనాలంటే ఏం చేయాలి?
గతంలో పోలిస్తే బంగారం ధర తగ్గడంతో చాలా మంది కొనడానికి ముందుకొస్తున్నారు. పెట్టుబడి కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఏమిమి మార్గాలున్నాయో తెలుసుకుందాం. సాధారణంగా బంగారాన్ని కొని నగలు చేయించుకుంటూ ఉంటారు. నాణ్యమైన బంగారాన్ని కొన్నామా లేదా అనేది కూడా అనుమానమే.
కాబట్టి బంగారాన్ని పెట్టుబడి కోసం కొనాలనుకునే వారు ముఖ్యంగా కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఫండ్ల రూపంలో లాభాలను అందిపుచ్చుకోవచ్చు.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లు:
వీటి పని తీరు మ్యూచువల్ ఫండ్ల రూపంలో ఉంటుంది. స్టాక్ మార్కెట్ పని చేసే సమయంలో యూనిట్ల రూపంలో వీటిని కొనుగోలు చేయెచ్చు లేదా అమ్ముకోవచ్చు. షేర్లలో పెట్టుబడి పెట్టినట్లు గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లు ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు.

గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లను ఎలా కొనాలి?
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో మదుపు చేయాలంటే డీమ్యాచ్, ట్రేడింగ్ అకౌంట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు వీలవుతుంది. యూనిట్లను కొన్నప్పుడూ, అమ్మినప్పుడు వినియోగదారుడే ఛార్జీలు భరించాల్సి ఉంటుంది.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను కూడా ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల విలువ ప్రపంంచ వ్యాప్తంగా ఉన్న బంగారం ధరల హెచ్చుతగ్గులపై ఆధాపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ ధరలను బట్టి యూనిట్లను కొనాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు.
వీటిలోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
నిజానికి ఏడాదికాలంగా ఉన్న బంగారంలో పెట్టుబడులపై పెద్దగా లాభాలు రావు. కాకపోతే బంగారానికి ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా ఇందులో పెట్టుబడి పెట్టడం మంచిదే. ముఖ్యంగా ఈటీఎఫ్‌లలో తయారీ ఖర్చు ఉండదు. నాణ్యత లోపం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు.
ఈటీఎఫ్‌లను తిరిగి అమ్మడం చాలా తేలిక. మీరు కొనుగోలు చేసిన యూనిట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేందుకు వెసులుబాటు ఉంది. బంగారంలో పెట్టుబడులన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. కాబట్టి దొంగల ఎత్తుకెళ్తారనే బాధ ఉండదు.
మార్కెట్లో అందుబాటులో ఉన్న గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లు:
| పథకం | ఎన్‌ఏవీ రూ. | 5 ఏళ్లలో రాబడి శాతం |
| ఆర్* షేర్స్ గోల్డ్ ఈటీఎఫ్ | 2,447.16 | 8.28 |
| ఎస్‌బీఐ గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ స్కీం | 2,519.99 | 7.89 |
| యూటీఐ గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ | 2,464.07 | 7.84 |
| క్వాంటం గోల్డ్ ఫండ్ | 1,225.55 | 7.83 |
| కొటక్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ | 2,454.54 | 7.76 |
| గోల్డ్ మ్యాన్ సాచెస్ గోల్డ్ ఈటీఎఫ్ | 2,451.88 | 7.71 |


Click it and Unblock the Notifications