ముంబై: సాధారణంగా చాలా మందికి స్టాక్ మార్కెట్లపై పెద్దగా అవగాహాన ఉండదు. స్టాక్ మార్కెట్ల సూచీలు, షేర్ విలువలు గురించి తెలుసుకోవాలని ఏమంత ఆసక్తి కూడా కనబర్చరు. ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్సేంజీల్లో ఉన్న భారత స్టాక్ మార్కెట్ల గురించి పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.
భారత్‌లో ఉన్న రెండు అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్‌లు ఉన్నాయి. అవి ఒకటి బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), రెండవది నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ). ఈ రెండు స్టాక్ ఎక్సేంజీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి.
సాధారణంగా స్టాక్ ఎక్సేంజీల్లో ట్రేడింగ్, సూచీలు, లాభాలు, నష్టాలు ఎక్కవగా వింటూ ఉంటాం. వీటితో పాటు చాలా మందికి భారత్ స్టాక్ ఎక్సేంజ్‌ల గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.

2 శాతం మంది మాత్రమే ఈక్విటీల్లో పోదుపు
భారత్‌లో ప్రజలు వారి సొమ్ముని ఎక్కువ భాగం బ్యాంకుల్లో పొదుపు చేసేందుకే ఆసక్తిని కనబరుస్తున్నారు. కేవలం 2 శాతం మంది మాత్రమే స్టాక్ మార్కెట్లో ఈక్విటీల రూపంలో పొదుపు చేస్తున్నారు. మరికొంత మంది బంగారం కోనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.

ఎక్కవ షేర్లు లిస్ట్ చేయడ్డాయి
ప్రపంచంలో కెల్లా అత్యధిక కంపెనీల షేర్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ చేయబడ్డాయి. రెండింటీలో కలిసి సుమారు 9000 కంపెనీలు లిస్ట్ కాబడ్డాయి.

అతిపెద్ద షేర్లు కలిగిన కంపెనీగా ఎల్ఐసీ
ఎక్కువ షేర్లు కలిగిన కంపెనీగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మొదటి స్ధానంలో ఉండగా, దేశీయంగా ఎల్ఐసీ ఎక్కువ షేర్లు కలిగిన సంస్ధగా స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ కాబడి ఉంది.

చెత్త స్టాటస్టిక్స్
మొత్తం కంపెనీల్లో సుమారు 6000 కంపెనీల షేర్లు అంతంత మాత్రంగానే ట్రేడ్ అవుతున్నాయి. ఎక్కువగా 3000 కంపెనీలకు చెందిన లిస్టెడ్ ట్రేడ్ మాత్రమే ట్రేడ్ అవుతుంటాయి.

ఉత్పన్నాల్లో రికార్డు స్ధాయి నమోదు
ఉత్పన్నాల మార్కెట్లో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ రెండో అతి పెద్ద వాల్యూమ్స్‌ను కలిగి ఉంది. ఇండెక్స్ ఆఫ్షన్స్‌లో రెండో స్ధానంలో ఉండగా, స్టాక్ ఇండెక్స్ ఫీచర్స్‌లో మూడో స్ధానంలో కొనసాగుతుంది.

నెమ్మదిగా పెట్టుబడిదారులు మార్కెట్లు తిరిగి వస్తున్నారు
గత మూడేళ్లలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పట్టేందుకు నెమ్మదిగా తిరిగి వస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ. 93 లక్షల కోట్లు కాగా జీడీపీలో ఇది 86 శాతానికి సమానం.

పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బు
సెన్సెక్స్, నిఫ్టీ విభాగాల్లో ఈ ఏడాది భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్ధాయి ప్రదర్శనను కనబర్చాయి. పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో డబ్బుని పొందారు.

బెంచ్ మార్క్‌కు చేరుకున్న నేషనల్ స్టాక్ ఎక్సేంజ్
2011, 2012 సంవత్సరానికి గాను నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఎలక్ట్రానిక్ బుక్ ఆర్డర్ ద్వారా అత్యధిక ఈక్వీటీ షేర్లలో ట్రేడింగ్ నిర్విహించిన సంస్ధగా రికార్డు సాధించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications