బెంగుళూరు: ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఇన్‌కమ్ ట్యాక్స్‌ను ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తుంటారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా సెక్షన్ 80సి కింద పన్ను ఆదా పొందే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లలో పొదుపు చేస్తే సరి. మనకి అందుబాటులో ఉన్న ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ సరైన స్కీమ్‌ను ఎంచుకోవడం ఎలా అనేది తెలిసుండాలి?
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అంటే ఏమిటి?
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అనేవి మ్యూచవల్ ఫండ్స్ లాంటివి. పన్ను మినహాయింపు ఉండటం వల్ల స్టాక్ మార్కెట్‌లో సమూహంగా పెట్టుబడి పెట్టిన డబ్బు పెరగడంలో దోహద పడతాయి. మిగతా పొదుపు పథకాలైన పీపీఎఫ్, బ్యాంక్ ట్యాక్స్ పొదుపు డిపాజిట్స్ లాగా కాకుండా ఖచ్చితమైన రాబడులను అందిస్తాయి. ఈ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్స్‌లో అధికంగా రిస్క్ ఉన్నా, ఈ ఒక్క కారణం చేతనే పెట్టుబడులు పెట్టవచ్చు.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌లో డబ్బుని ఎలాగైతే పొందుతామో, అదే విధంగా పొగొట్టుకునే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లేతే సాంప్రదాయ ఫిక్సడ్ డిపాజిట్ స్కీమ్స్‌తో పోలిస్తే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఎక్కువ డబ్బుని పొందుతున్నారు. పాఠకుల కోసం అందుబాటులో ఉన్న కొన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాం.
భారత్‌లో అత్యుత్తమ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్:
పైన పేర్కొన్న ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు గత ఏడాది అత్యుత్తమ రాబడులను పొందారు. ఇవే రాబడులు వచ్చే ఏడాది కూడా వస్తాయకునుకుంటే మీరు పోరబాటు పడినట్లే.
| Name of Fund | Last one Year Returns |
| Reliance Tax Saver | 102.00% |
| IDBI Equity Advantage | 87.00% |
| Axis Long Term Equity Fund | 79.00% |
| Escorts Tax Plan | 75.00% |
| Kotak Tax Saver | 72.00% |
| Birla Sun Life Tax Relief | 70.00% |
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చా?
గత ఏడాది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ మంచి రాబడులను ఇచ్చాయనడంలో ఎలాంటి సందేహాం లేదు. సాంప్రదాయ పొదుపు పథకాలైన పీపీఎఫ్, ఎన్ఎస్సీ, బ్యాంకు ట్యాక్స్ డిపాజిట్ పొదుపు ఖాతాలతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. రాబడుల్లో కూడా ఎక్కువ శాతం పొందే అవకాశం ఉంది. రిస్క్ తీసుకుందామనుకునే వారికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఉత్తమం. కాదనుకుంటే సాంప్రదాయ పథకాల్లో పెట్టుబడులు పెట్టుకుంటే మంచింది.


Click it and Unblock the Notifications