బ్యాంకు లాకర్‌ను ఏడాదిలో ఒకసారి తెరవాలి.. ఎందుకు?
న్యూఢిల్లీ: బ్యాంకు లాకర్ గురించి విన్నాం కదా. మన వద్ద ఉన్న బంగారు నగలు, రహస్య డాక్యుమెంట్లు, విలువైన నగదు ఉన్నప్పుడు వాటిని ఇంట్లో భద్రంగా దాచుకోలేం కాబట్టి బ్యాంకు లాకర్‌లో ఉంచడం మంచిది. కొంత మంది ఖాతాదారులు బ్యాంకు లాకర్‌లో సొమ్మును భద్రపరచి వాటి గురించి మరిచిపోతారు.
కాగా, బ్యాంకు నిపుణులు ఏమని చెబుతున్నారంటే ఏదైనా బ్యాంకు లాకర్‌లో ఇంటిపత్రాలు లేదా ఆభరణాలు దాచినప్పుడు ఏడాదికొకసారి బ్యాంకు లాకర్‌ను తెరిచిచూడటం మంచిదంటున్నారు. అలా చేయని పక్షంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు.
సాధారణంగా మనం చేసే వృత్తి, వయసును బట్టి బ్యాంకు హై రిస్క్ ప్రొపైల్ లేదా లో రిస్క్ ప్రొపైల్ లాకర్ ఇస్తుంది. బ్యాంకు లాకర్ ఇచ్చినందుకు సంవత్సరానికి కొంత ఫీజును తీసుకుంటుంది. బంగారు నగలు, రహస్య డాక్యుమెంట్లు, విలువైన నగదు ఉన్న వారికి హై రిస్క్ ప్రొపైల్ కేటగీరి కింద బ్యాంకు లాకర్ ఇస్తుంది.

లాకర్‌ను తీసుకున్న తర్వాత ప్రతి ఏడాదికి ఒకసారి లాకర్‌ను తెరచి చూసుకోవాలి. అలా చేయడం వల్ల మన లాకర్‌లో ఉంచిన విలువన నగదు, రహస్య డాక్యుమెంట్లు గురించి తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల్లోని లాకర్స్‌లో దోపీడీ దొంగతనాలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ లాకర్ తీసుకుందుకు గాను వారు సరైన సమయంలో బ్యాంకుకి నగదు జమ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా లో రిస్క్ ప్రొపైల్ లాకర్‌ను తీసుకున్న కస్టమర్లు మూడు సంవత్సరాలకు ఒకసారి లాకర్‌ను తెరిచి చూసుకోవాలని బ్యాంకు వర్గాలు తెలిపారు. కస్టమర్లు ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
లాకర్ కీ భద్రంగా ఉంచుకోవాలి:
బ్యాంకులో లాకర్ తెరిచిన కస్టమర్ లాకర్ కీని భద్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా బ్యాంకు లాకర్ తెరిచిన తర్వాత ఒక కీని కస్టమర్‌కు ఇవ్వడంతో పాటు మరో కీని బ్యాంకు తన వద్దే ఉంచుకుంటుంది. ఒకవేళ మీరు గనుక లాకర్ కీని పొగొట్టుకున్నట్లైతే, బ్యాంకు లాకర్ కీని పగులగొట్టడం లాంటివి చేయకుండా బ్యాంకును సంప్రదించాలి. అలా సంప్రదించనట్లైతే లాకర్ కీని మార్చడం లేదా వేరే కీని బ్యాంకే ఇస్తుంది.


Click it and Unblock the Notifications