హైదరాబాద్: రాము ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు వేల్లలో జీతం. తనకు వస్తున్న సంపాదనలో కొంత మొత్తం ఖర్చు పెట్టగా.. మిగిలిన భాగాన్ని దాచుకుంటున్నాడు. అలా దాచుకున్న మొత్తం కొన్ని లక్షలైంది. దీంతో అతను ఈ మొత్తాన్ని ఉపయోగించి హైదరాబాద్ మహా నగరంలో ఆస్తి కొనాలనే ఆలోచన అతని వచ్చింది.
ఇటీవల కాలంలో ఆస్తి అమ్మకాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఒకే ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో చాలా మందికి విక్రయిస్తూ ఉంటారు ఆస్తి దారులు. ఐతే చదువుకున్న రాము ఇలాంటి మోసాలకు గురి కాకుండా ముందుగానే ఆస్తి కొనేముందు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయనే ఆలోచన మొదలైంది.
ఇలాగ చాలా మంది రాములకు వచ్చిన సందేహాలు మనలో చాలా మందికి వచ్చి ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కొన్ని ముఖ్యమైన సూచలను అందిస్తున్నాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్యుమెంట్ ఒరిజనలేనా
సాధారణంగా ఆస్తి చాలా చేతులు మారుతుంది. ఐతే ఈ ఆస్తికి మూలం ఎక్కడిది అనేది తెలుసుకోవాలి. అంతే కాదు మొదటి ఓనర్ తాలుకా అన్ని వివరాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి.

చిక్కుముడులు
హైద్రాబాద్ మహానగరంలో ఉన్న ఆస్తికి అక్కడి ప్రభుత్వ అనుమతులు అన్నీ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఉదాహారణకు హైదరాబాద్‌లో జీహెచ్‌ఎమ్‌సి నుంచి అన్ని అనుమతులు ఆ ఆస్తికి ఉన్నాయా లేదా పరిశీలించాలి.

ఓనర్లు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్
మీరు కొనుగోలు చేసే ఆస్తికి ఎక్కువ మంది ఓనర్లు ఉన్నట్లైతే వారి వద్ద నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పకుండా తీసుకోవాలి.

రుణభారం సర్టిఫికెట్
రిజిస్టర్ ఆఫీస్ నుండి ముఖ్యంగా ఈ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీని ఉపయోగం ఏమిటంటే మీరు కోనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి ఓనర్‌పై ఉందా లేదా అనేది తెలుస్తుంది.

పేరు
ఎవరి వద్ద నుంచైతే మీరు ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటారో వారి పేరు.. అందులో ఉందో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలి.

ట్యాక్స్ సకాలంలో చెల్లిస్తున్నాడా
ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్లేతే అతను సకాలంలో ట్యాక్స్ చెల్లిస్తున్నాడా.. లేదా సరి సరిచూసుకోండి. మహా నగరాల్లో సకాలంలో ట్యాక్స్ చెల్లించకపోతే ఇల్లు మీ పేరు మీదకు బదిలీ అవదు.

సొసైటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్
కొన్ని కొన్ని ఆస్తిలకు సొసైటీ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం గురించి కూడా మీరు ఆలోచించాలి.

మంచి లాయర్‌ను నియమించుకోండి
లక్షల్లో డబ్బు పెట్టి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మంచి లాయర్‌ని కూడా సంప్రదించడం మంచి పద్దతి. ఎందుకంటే ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత ఏమైనా వివాదాలు వస్తే లాయర్ తప్పనిసరి కదా..
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications