భారత ఐపీఎల్ జట్లు ఫైనాన్షియల్ పరంగా పటిష్టంగా ఉన్నాయా..?
భారత్‌లో అత్యంత ఖరీదైన క్రీడగా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 6వ సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్ గురించి బిజినెస్ స్టాండర్డ్ అనే మ్యాగజైన్ కొన్ని చేదు నిజాలను తెలిపింది. సాధారణంగా ఐపీఎల్ ఆటను కాసుల పంటగా అభివర్ణిస్తుంటారు. ఐతే బిజినెస్ స్టాండర్డ్ మాత్రం ఐపీఎల్ టీమ్స్‌కు స్పాన్సర్ షిప్‌గా వ్యవహారిస్తున్న కంపెనీలు మాత్రం నష్టాలను మూటగట్టుకుంటున్నాయని పేర్కొంది. క్రీడాభిమానులను ఊర్రూతలూగించడానికి సిద్దమైన ఈ ఐపీఎల్ గురించి బిజినెస్ స్టాండర్డ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వ్యాపార ప్రామాణికలను తెలుసుకుందాం.
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 6వ సీజన్‌కు సంబంధించిన ప్రారంభ వేడుకలు ‘సిటీ ఆఫ్ జాయ్'గా పిలుచుకునే కోల్‌కతాలో జరిగాయి. స్థానిక సాల్ట్ లేక్ స్టేడియంలో లీగ్ ప్రారంభ వేడుకలు అత్యంత అట్టహాసంగా, ఉల్లాసభరితంగా గంటా 45 నిమిషాల పాటు సాగాయి. 60 వేల మంది ప్రేక్షకులతో నిండిపోయిన సాల్ట్ లేక్ స్టేడియంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభోత్సవ జ్యోతిని వెలిగించారు.

కోల్‌కత్తా నైట్ రైడర్స్
గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 5వ సీజన్‌ను ట్రోఫీని కైవసం చేసుకోవడంతో మార్చి 31, 2012 ఆర్దిక సంవత్సరానికి గాను రూ. 10.4 కోట్ల రూపాయలను కోల్ కత్తా నైట్ రైడర్స్ లాభాలను గడించిందని బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది. ఇది మాత్రమే కాకుండా ఐపీఎల్‌లో సక్సెస్‌పుల్ ప్రాంచైజీగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.
టీమ్ ఓనర్: షారుక్ ఖాన్
కెప్టెన్: గౌతమ్ గంభీర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టాక్స్ చెల్లించడానికి ముందు 2012 ఆర్దిక సంవత్సరంలో రూ. 9.5 కోట్ల నష్టాలను గడించిందని బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది. అదే 2011వ ఆర్దిక సంవత్సరంలో రూ. 7.8 కోట్ల నష్టాలను చవి చూసిందని తెలిపింది.
టీమ్ ఓనర్: విజయ్ మాల్యా
కెప్టెన్: విరాట్ కోహ్లీ

పూణె వారియర్స్
సహారా అడ్వంచర్ స్పోర్ట్స్‌కు చెందిన పూణె వారియర్స్ టీమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 2012వ ఆర్దిక సంవత్సరానికి ఎకౌంటింగ్ డిటేల్స్‌ను సమర్పించలేదు. ఐతే సమాచారం ప్రకారం టాక్స్ చెల్లించడానికి ముందు రూ. 2.6 కోట్ల లాభాలను గడించింది. 2011వ సంవత్సరానికి రెవిన్యూ రూ. 15.9 కోట్లు.
టీమ్ ఓనర్: సుబ్రతో రాయ్
కెప్టెన్: ఏంజిలో మ్యాధ్యూస్

రాజస్దాన్ రాయల్స్
జైపూర్ ఐపీఎల్ క్రికెట్‌కు చెందిన రాజస్దాన్ రాయల్స్ 2012వ సంవత్సరానికి అకౌంటింగ్ డిటేల్స్‌ను సమర్పించలేదు. మార్చి 31, 2011 ఆర్దిక సంవత్సరానికి గాను రూ. 7 కోట్ల లాభాలను గడించిందని బిజినెస్ స్టాండర్ట్ పేర్కొంది.
టీమ్ ఓనర్: శిల్పాశెట్టి
కెప్టెన్: రాహుల్ ద్రవిడ్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కెపిహెచ్ డ్రీమ్ క్రికెట్ సహ యాజమాన్యంలోని కింగ్స్ ఎలెవన్ టీమ్‌కి బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ఓనర్‌గా వ్యవహారిస్తుంది. 2012 ఆర్దిక సంవత్సరానికి గాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 1.5 కోట్ల నష్టాలను మూటగట్టకున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది.
టీమ్ ఓనర్: ప్రీతి జింటా
కెప్టెన్: ఆడమ్ గిల్‌క్రిస్ట్


Click it and Unblock the Notifications