ఉపాధి పొందే వారికోసం ఎల్‌ఐసీ రోజువారీ చెల్లింపు హౌసింగ్ స్కీమ్

ఈ కొత్త పథకం ద్వారా చిన్న వ్యాపారస్తులు, రైతులు దుకాణదారులు గృహ రుణాలు పొందడంలో ఇబ్బందులకు ఇక కాలం చెల్లనుంది. అలాంటి వారందరికి ఈ పథకం చాలా మందికి ప్రయోజనం కలగనుందని అన్నారు. తమ సంస్థ ఇచ్చిన మొత్తం రుణాల్లో స్వయం ఉపాధి వ్యక్తులకు ఇచ్చిన రుణాలు 15 శాతంగా ఉన్నాయని వివరించారు. తాము ఇటీవలనే మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన భాగ్యలక్ష్మి గృహరుణ స్కీమ్‌కు మంచి స్పందన లభిస్తోందని వీకే శర్మ తెలిపారు.
ఎల్‌ఐసీ కొత్తగా మైక్రో ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీ ఆవిర్భవించి 56 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘జీవన్ దీప్' పేరుతో గ్యారంటీ రాబడిని అందించే ఈ సూక్ష్మ బీమా పథకాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. మైక్రో ఇన్సూరెన్స్‌లో ఎల్‌ఐసీ అందిస్తున్న తొలి ఎండోమెంట్ పథకమే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా తీసుకునే వెసులుబాటును ఎల్‌ఐసీ కల్పిస్తోంది.
గ్యారంటీ అడిషన్, లాయల్టీ అడిషన్లు జీవన్ దీప్‌లోని ప్రత్యేక ఆకర్షణలు. కనీస బీమా రూ.5,000, గరిష్ట బీమా రూ.30,000గా నిర్ణయించారు. ఏ పాలసీలో లేని విధంగా జీవన్ దీప్‌లో 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ఎల్‌ఐసీ అందిస్తోంది. ప్రీమియం చెల్లించకపోతే ఎటువంటి పెనాల్టీలు లేకుండా 60 రోజులలోపు చెల్లించుకోవచ్చు. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.10,000 ప్రమాద బీమా రక్షణను పొందవచ్చు. ఇందుకోసం పాలసీదారుడు రూ.10 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications