ఎస్‌బీహెచ్ ఇన్సూరెన్స్ ఆఫర్: రూ.100కే రూ. 4 లక్షల ప్రమాద బీమా

State Bank of India
State Bank of India: Quotes, News
BSE 1004.50BSE Quote2.9 (0.29%)
NSE 1009.70NSE Quote9.2 (0.91%)
హైదరాబాద్: తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే భాగంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పొదుపు ఖాతాదారులకు వ్యక్తిగత బీమా పాలసీని ప్రవేశపెట్టింది. 18 నుండి 65 సంవత్సరాల వయసు కలిగిన బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే ఈ పాలసీ అమలు చేయనున్నారు. ఈ పాలసీ క్రింద సంవత్సరానికి రూ. 100 ప్రీమియం చెల్లిస్తే రూ. నాలుగు లక్షల ప్రమాద బీమా రక్షణ లభిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఒక ప్రకటనలో పేర్కొంది.

పొదుపు ఖాతాదారుడు ఏదైనా ప్రమాదంలో మరణిస్తేనే ఈ బీమా రక్షణ లభిస్తుందని, ప్రమాదంలో అంగవైకల్యం వంటి సంభవిస్తే ఎలాంటి బీమా పరిహారం ఉండదని ఎస్‌బీహెచ్ పేర్కొంది. ఖాతాదారులకు బీమా రక్షణ కల్పించడానికి ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఎస్‌బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది.

వివరాల్లోకి వెళితే 18 సంవత్సరాలు వయసు దాటిన వారి నుండి 65 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం రూ. 100 చెల్లించడం ద్వారా ఈ బీమా ప్రయోజనాన్ని పునరుద్దరించుకోవాలి. ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల 82.39 లక్షల మంది ఖాతాదారులకు ప్రయోజనం లభించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 1,500 ఎస్‌బీహెచ్ శాఖల నుండి ఈ పాలసీని తీసుకోవచ్చని, దగ్గరలో ఉన్న శాఖకు వెళ్లి సంబంధింత దరఖాస్తు పూర్తి చేస్తే, పాలసీ పత్రం ఖాతాదారు ఇంటి అడ్రస్‌కు పంపిస్తారు.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+