'స్మార్ట్ ఇన్ కమ్ ప్రొటెక్ట్' సేవింగ్స్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన ఎస్‌బీఐ లైఫ్

SBI
State Bank of India: Quotes, News
BSE 954.00BSE Quote6.7 (-0.70%)
NSE 954.10NSE Quote5.4 (-0.57%)
ముంబై: ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్ద ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ ఇన్ కమ్ ప్రొటెక్ట్ పేరు మీద హామీతో కూడిన ఓ సంప్రదాయక సేవింగ్స్ ప్లాన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ పొదుపు పథకంలో పన్ను చెల్లించలేనటువంటి విధంగా క్రమం తప్పని ఆదాయాన్ని హామీగా ఇస్తున్నారు. సమ్ అష్యూర్డ్ (ఎస్‌ఏ) పైన గానీ లేదా పెయిడ్ సమ్ అష్యూర్డ్ పైన ఇన్సూరెన్స్ పూర్తైన తర్వాత అనంతరం వచ్చే 15 సంవత్సరాలకు లేదా 11 శాతం గ్యారంటీ రేటుతో రెగ్యులర్ ఇన్ కమ్ అందిస్తామని ఎస్‌బీఐ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఈ ఇన్సూరెన్స్ ద్వారా జీవిత బీమా రక్షణను, పాలసీ పరిపక్వ వేళలో ఒకే మొత్తంలో ప్రయోజనాన్ని, పరిపక్వ కాలం ముగిశాక 15 ఏళ్ల పాటు క్రమ పద్దతిలో చెల్లింపులు సైతం అందజేస్తుంది. పాలసీదారు మరణించిన పక్షంలో సమ్ అష్యూర్డ్ డబ్బును పాలసీలో పేర్కొన్న నామినీకి గానీ, లేదా చట్టబద్ద వారసులకు గానీ బోనసులు సహా ఏక మొత్తంలో వెంటనే చెల్లిస్తామని తెలిపింది. ఈ పాలసీలో చేరేందుకు కనీస వయసు 8 ఏళ్లు, గరిష్ట వయసు 60 ఏళ్లుగా నిర్ణయించామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఎమ్‌డీ, సీఈఓ అతాను సేన్ వెల్లడించారు.

ఇక స్మార్ట్ ఇన్ కమ్ ప్రొటెక్ట్ పేరు మీద వస్తున్న ఈ సరిక్రొత్త ప్లాన్ మెర్చూర్ కనిష్ట కాలం 18 ఏళ్లు, గరిష్ట కాలం 65 ఏళ్లు.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+