2022లో 11 నుండి 100% లాభాలు ఇచ్చే స్టాక్స్, ఎస్బీఐ 50 శాతం జంప్
స్టాక్ మార్కెట్ పరుగు కొనసాగుతుందని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి సాగిస్తున్న దేశాల్లో భారత్ ఉంది. 2022 డిసెంబర్ చివరి నాటికి సెన్సెక్స్ 70,000 పాయింట్లకు, మరింత దూకుడు కనబరిస్తే 80,000 పాయింట్లకు చేరుకోవచ్చునని గతంలో కొన్ని రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి. తాజాగా యస్ సెక్యూరిటీస్ భారత మార్కెట్ పైన, ఈ ఏడాది అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్న కొన్ని స్టాక్స్‌ను పేర్కొంది. 2021లో హెవీ వెయిట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినప్పటికీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు అంతకుమించి లాభాలు ఇచ్చాయి.

సమృద్ధిగా లిక్విడిటీ
నిఫ్టీ 2022 చివరి నాటికి 21,000 పాయింట్లకు చేరుకోవచ్చునని, అలాగే 2025 నాటికి 32,000 పాయింట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని యస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అంటే 2022లో నిఫ్టీ 17 శాతం, 2025 నాటికి 78 శాతం అబ్జల్యూట్ రిటర్న్స్ ఇవ్వవచ్చు.
లిక్విడిటీ సమృద్ధిగా ఉందని, భారత మార్కెట్లలో పెరుగుతున్న సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింత కొనసాగిస్తుందని తెలిపింది.
హౌస్ హోల్డ్ వినియోగంలో భారీ పెరుగుదల కనిపిస్తోందని యస్ సెక్యూరిటీస్ విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే నాలుగేళ్లలో హౌస్ హోల్డ్ సేవింగ్స్ 46 శాతానికి పెరుగుతుందని, ఇది జీడీపీలో 19 శాతానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇది వినియోగంపై ఖర్చు చేయవలసిన పునర్వినియోగపరచదగిన ఆదాయ పరిమాణాన్ని పెంచుతుందన్నారు.

అత్యధిక యువత
అధిక డొమెస్టిక్ డిమాండ్ అంచనాలతో జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీస్ క్రిస్టోఫర్ వుడ్ తన పోర్ట్ పోలియోలను భారత్‌కు మలిచారు. ఆసక్తికర అంశం ఏమంటే ద్రవ్యోల్భణం వల్ల వినియోగం తగ్గదని యస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక యువత కలిగిన భారత్.. వినియోగాన్ని బలపరుస్తుందన్నారు. గిగ్ ఎకానమీ ఈ దశాబ్దంలో 80 మిలియన్లకు పైగా ఉద్యోగాలు జోడించబడతాయని, జీడీపీలో సహకారం 10 శాతం వరకు పెరుగుతుందని విశ్వసిస్తోంది.

2022లో రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్
వివిధ సానుకూల అంశాల నేపథ్యంలో 2022లో 100 శాతం రిటర్న్స్ ఇచ్చే పలు స్టాక్స్‌ను యస్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. అంతర్జాతీయ, జాతీయ, రాజకీయ, సరిహద్దు వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు రిస్క్‌కు సిద్ధం కావాలి.
యస్ సెక్యూరిటీస్ పిక్ చేసిన 16 స్టాక్స్ ఇవే...
అపోలో పైప్, గ్లాండ్ ఫార్మా, పాలీక్యాబ్, సన్ టెక్ రియాల్టీ, సీసీఎల్ ప్రోడక్ట్స్, ఐసీఐసీఐ ప్రు, ప్రెస్టీజ్ ఎస్టేట్, టాటా మోటార్స్, రిలయన్స్, ఐజీఎల్, క్రిసిల్, వీమార్ట్, దాల్మియా, ఇండియా మార్ట్, ఎస్బీఐ కార్డ్స్, ఎస్బీఐ ఉన్నాయి. అయితే ఈ స్టాక్స్ 11 శాతం నుండి 11 శాతం వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చు.


Click it and Unblock the Notifications