క్రెడిట్ కార్డులు వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక సంచలన, ఆలోచింపజేసే సంఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. పదేళ్ల క్రితమే మూసివేసిన క్రెడిట్ కార్డుకు సంబంధించి, ఒక బ్యాంకు ఏకంగా ₹33.83 లక్షల బకాయి చెల్లించాలని నోటీసు పంపడం, ఆపై వినియోగదారుల కోర్టు సదరు బ్యాంకుకు భారీ జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.మైసూరుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం, క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తోంది.
2010 ఆగస్టు 27న ఆయన తన క్రెడిట్ కార్డును మూసివేయాలని బ్యాంకును కోరారు. ఆ సమయంలో తన ఖాతాలో ఉన్న రూ.15,500 బకాయి మొత్తాన్ని పూర్తిగా చెల్లించడమే కాకుండా, బ్యాంకు నుండి కార్డు మూసివేసినట్లు ధృవీకరణ కూడా పొందారు. దీంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసిందని ఆయన ప్రశాంతంగా ఉన్నారు. కానీ, సరిగ్గా పదేళ్ల తర్వాత 2020 డిసెంబర్ 25న బ్యాంకు నుండి వచ్చిన ఒక లీగల్ నోటీసు ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ నోటీసులో ఆయన ఏకంగా రూ. 33.83 లక్షల బకాయి పడ్డారని పేర్కొనడం వెంకటేష్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అక్కడితో ఆగకుండా, ఆ భారీ మొత్తాన్ని చెల్లించాలంటూ బ్యాంకు నుండి నిరంతరం ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, వేధింపులు మొదలయ్యాయి. 2022 జూన్ 15న బ్యాంకు మరోసారి లీగల్ నోటీసు పంపడంతో, విసిగిపోయిన వెంకటేష్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తాను పదేళ్ల క్రితమే కార్డు క్లోజ్ చేశానని, అప్పటి నుండి ఎటువంటి లావాదేవీలు చేయలేదని లిఖితపూర్వక సమాధానం ఇచ్చినా బ్యాంకు వెనక్కి తగ్గలేదు. చివరకు ఆయన జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించగా.. 2024లో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ లక్ష రూపాయల నష్టపరిహారం మంజూరు చేసింది. అయితే, పదేళ్ల పాటు అనుభవించిన మానసిక వేదనకు ఈ పరిహారం సరిపోదని భావించిన ఆయన.. కర్ణాటక రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీల్ చేశారు.
ఈ కేసును క్షుణ్ణంగా విచారించిన రాష్ట్ర కమిషన్ 2026 ఫిబ్రవరి 12న సంచలన తీర్పు వెలువరించింది. బ్యాంకు అనుసరించిన విధానాన్ని అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా కోర్టు అభివర్ణించింది. ఇప్పటికే కార్డు మూసివేసిన వ్యక్తిని పదేళ్ల తర్వాత అంత పెద్ద మొత్తం చెల్లించమని అడగడం తీవ్రమైన తప్పిదమని పేర్కొంది. దీనివల్ల బాధితుడికి మానసిక క్షోభ కలగడమే కాకుండా.. అతని సిబిల్ (CIBIL) ప్రొఫైల్ కూడా దారుణంగా దెబ్బతిందని కోర్టు గుర్తించింది. అందుకే జిల్లా ఫోరం ఇచ్చిన పరిహారాన్ని పెంచుతూ.. బ్యాంకుకు భారీ జరిమానా విధించింది.
రాష్ట్ర కమిషన్ తీర్పు ప్రకారం.. బ్యాంకు వెంకటేష్‌కు రూ. 5 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలి. దీనికి అదనంగా న్యాయవాది ఫీజుల కింద రూ. లక్ష, వ్యాజ్యపు ఖర్చుల కింద మరో రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం 30 రోజులలోపు చెల్లించకపోతే, అప్పటి నుండి 9 శాతం వడ్డీని కూడా అదనంగా భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఉదంతం క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు నుండి నో డ్యూ సర్టిఫికేట్" (No Dues Certificate) తీసుకోవడం ఎంత అవసరమో గుర్తుచేస్తోంది. అలాగే సిబిల్ స్కోరుపై బ్యాంకు ఇచ్చే తప్పుడు నివేదికల వల్ల వినియోగదారులు ఎంతటి ఇబ్బందులు పడతారో ఈ కేసు నిరూపించింది.
More From GoodReturns

SBI Card యూజర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుండి రూల్స్ చేంజ్!

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications
