రికరింగ్ డిపాజిట్ రిస్క్ లేని పెట్టుబడి సాధనం. ముఖ్యంగా వృద్ధులకు ఇది ఉపయుక్తం. మ్యూచువల్ ఫండ్స్ సిప్ మాదిరిగానే ప్రతినెల ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని జమ చేయడానికి, ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే కాస్త వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశముంది. స్వల్పకాలిక లక్ష్యాల కోసం రికరింగ్ డిపాజిట్స్ ప్రసిద్ధి గాంచినది. కాబట్టి మార్కెట్ ఆధారిత పెట్టుబడికి విముఖత చూపేవారు, రిస్క్ వద్దనుకునే స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలు కలిగిన పెట్టుబడిదారులకు ఇది అనువైనది.
రికరింగ్ డిపాజిట్స్ DICGC మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా లేదా సేవింగ్స్ ఖాతా మాదిరి రికరింగ్ డిపాజిట్స్‌లోను రూ.5 లక్షల వరకు DICGC బీమా వర్తిస్తుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని రికరింగ్ డిపాజిట్స్ పైన ఉత్తమ వడ్డీ రేట్లు అందించే టాప్ 10 ప్రభుత్వ, ప్రయివేటు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇక్కడ చూడండి.

రికరింగ్ డిపాజిట్స్‌పై అధిక వడ్డీ రేటు ఇచ్చే ప్రయివేటు బ్యాంకులు ఇవి...
- యస్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.25%,
- RBL బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,
- DCB బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,
- ఇండస్ఇండ్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,
- IDFC ఫస్ట్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్లకు 6.50%,
- యాక్సిస్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్లకు 6.50%,
- ICICI బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్లకు 6.30%,
- బంధన్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్లకు 6.25%,
- HDFC బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్లకు 6.00%,
- కొటక్ మహీంద్రా బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్లకు 5.75%,

ప్రభుత్వరంగ బ్యాంకులు
రికరింగ్ డిపాజిట్స్‌పై అధిక వడ్డీ రేటు ఇచ్చే ప్రభుత్వరంగ బ్యాంకులు ఇవి...
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రెగ్యులర్ వడ్డీ రేటు 5.60%, సీనియర్ సిటిజన్లకు 6.10%,
- కెనరా బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్లకు 6.00%,
- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.30%, సీనియర్ సిటిజన్లకు 5.80%,
- బ్యాంక్ ఆఫ్ బరోడా - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్లకు 6.25%,
- IDBI బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్లకు 5.75%,
- పంజాబ్ నేషనల్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్లకు 5.75%,
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు - రెగ్యువలర్ వడ్డీ రేటు 5.25% 5.75%,
- ఇండియన్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.15%, సీనియర్ సిటిజన్లకు 5.65%,
- బ్యాంక్ ఆఫ్ ఇండియా - రెగ్యులర్ వడ్డీ రేటు 5.15%, సీనియర్ సిటిజన్లకు 5.65%,
- సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా - రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
రికరింగ్ డిపాజిట్స్‌పై అధిక వడ్డీ రేటు ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవి...
- నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 7.50%, సీనియర్ సిటిజన్లకు 8.00%,
- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 7.00%, సీనియర్ సిటిజన్లకు7.50%,
- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్లకు 7.25%,
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్లకు 7.25%,
- సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్లకు 6.75%,
- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,
- ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,
- ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,
- క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75%,
- AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75%
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications