zuno: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ప్రభుత్వం సైతం ఆ దిశగా ప్రజలను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం 1 శాతంగా ఉన్న EVలను 2030 నాటికి 30 శాతానికి, 2070 నాటికి జీరో ఉద్గారాల దిశగా తీసుకెళ్లాలని మోడీ సర్కారు భావిస్తోంది. అయితే వీటి బీమా విషయానికి వస్తే.. సాధారణ వెహికల్స్ మాదిరిగానే ఇప్పటి వరకు EVలనూ చూస్తున్నారు. సాంప్రదాయ వాహనాలకు భిన్నంగా ఎలక్ట్రిక్ వాహనాలను పరిగణిచాలంటూ.. EVల కోసం దేశంలో మొదటిసారిగా ప్రత్యేక బీమాను జునో సంస్థ తీసుకురానుంది.

హార్డ్ వేర్ నిపుణులు ఒక్కరే సరిపోరు:
సాధారణ, ఎలక్ట్రిక్ వాహనాలు చూడటానికి ఒకే విధంగా కనిపించినా.. లోపలి భాగాలు, పనితీరు పూర్తి విరుద్ధంగా ఉంటాయని బీమా సంస్థ జునో(గతంలో Edelweiss జనరల్ ఇన్యూరెన్స్) అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే.. తిరిగి బాగుచేయడానికి కేవలం హార్డ్ వేర్ నిపుణులు మాత్రమే సరిపోరని పేర్కొంది. దానితో పాటు సాఫ్ట్ వేర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానం అవసరమని గర్తుచేసింది.

EVల కోసమే ప్రత్యేక పాలసీ:
EVలను కవర్ చేసే బీమా పాలసీలు ఇప్పటికే మార్కెట్ లో ఉన్నా, ఎలక్ట్రిక్ వాహనాల ప్రత్యేక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడలేదని జునో MD & CEO షనాయ్ ఘోష్ తెలిపారు. అందుకే తమ భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా.. భారతదేశంలో మొట్టమొదటిగా EVల కోసం ఓ వినూత్న పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. FY2024 Q2 నుంచి దీనిని పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

బెస్ట్ పాలసీలు:
జునో తాజాగా ప్రవేశపెట్టిన బీమా పాలసీలు 'డ్రైవ్ లెస్-పే లెస్, డ్రైవ్ బెటర్-పే లెస్' బాగా ప్రాచుర్యం పొందాయి. కేవలం బీమాతో పాటు సాంకేతికత సహాయంతో డ్రైవింగ్ ను మెరుగుపరచుకునేందుకు సైతం సహయం చేసే విధంగా ఈ పాలసీలు రూపొందించబడ్డాయి. డ్రైవింగ్ పాటర్న్స్ ఆధారంగా యాప్‌లో రివార్డ్ లనూ సంపాదించుకోవచ్చు. ప్రీమియం చెల్లించే సమయంలో వాటిని రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది.

సాంకేతికతే దన్నుగా..
పై పాలసీల్లో.. వినియోగదారులు కొత్తగా బీమా తీసుకున్న తర్వాత మొబైల్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని నమోదు కావాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లోని గైరోస్కోప్, ఇతర సెన్సార్ ల ద్వారా.. కస్టమర్ డ్రైవింగ్ విధానాన్ని ఆ యాప్ ట్రాక్ చేసి స్కోరు అందిస్తుంది. ఈ డేటాను విశ్లేషించి డ్రైవింగ్ విధానం మెరుగుపరచుకోవడానికి, సురక్షితమైన డ్రైవింగ్ నమూనాలను అనుసరించడానికి జనో సహాయపడుతుంది.

సురక్షితమైన డ్రైవింగ్ ద్వారా డ్రైవింగ్ వృద్ధి
ప్రస్తుతం దాదాపు అన్ని బీమా కంపెనీలు వాహనం తయారీదారు, మోడల్, వేరియంట్, వయసు, కవర్, యాడాన్లు, నో క్లెయిమ్ బోనస్ ఆధారంగా ప్రీమియంను తగ్గిస్తున్నాయి. కానీ అందుకు విభిన్నంగా వాహనాలను సురక్షితంగా ఉపయోగించే వ్యక్తులకు రివార్డులు అందించనున్నట్లు జునో చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ రాకేష్ కౌల్ తెలిపారు. ఇలా అధునాతన డేటాను అందించడం ద్వారా స్థిరమైన వృద్ధితో మరింత ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు.

డిజిటల్ అడాప్షన్:
దేశంలో డిజిటల్ అడాప్షన్ ద్వారా అనేక ఫీచర్లను కొత్తగా పరిచయం చేసిన మొదటి కంపెనీగా జునోకు మంచి పేరు ఉంది. వాహనం వినియోగంలో లేనప్పుడు బీమా స్విచ్ ఆఫ్ చేయడం, ఆటోమేటెడ్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ కోసం AI వాయిస్ బాట్, ఆన్ డిమాండ్ మొబైల్ టెలిమాటిక్స్ ఆధారిత బీమా పాలసీ, పే యాజ్ యు డ్రైవ్, అవుట్ ఆఫ్ నెట్వర్క్ క్యాష్ అడ్వాన్స్ వంటివి వాటిలో ప్రాముఖ్యమైనవి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications