15 నిమిషాల్లో కాఫీ, టీ, స్నాక్స్.. బిస్ట్రో కొత్త యాప్ లాంచ్ చేసిన బ్లింకిట్..
మీకు నచ్చిన స్నాక్స్, డ్రింక్స్ మెరుపు వేగంతో డెలివరీ చేసే రేస్ హైటెక్కుతుంది. ఇందుకు కారణం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్ (Blinkit) కొత్త యాప్ బిస్ట్రోని తాజాగా లాంచ్ చేసింది. ఈ సందర్బంగా కేవలం 15 నిమిషాల్లో మీల్స్, టీ, కాఫీ అండ్ స్నాక్స్ మీ వద్దకు డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది. బిస్ట్రో ఇప్పటికే గురుగ్రామ్‌లోని సెలక్ట్ చేసిన ప్రాంతాల్లో ఈ సేవలను అందిస్తుంది. బిస్ట్రో లాంచ్ తో జెప్టో కేఫ్, స్విగ్గీస్ బోల్ట్‌కి గట్టి పోటీ ఇవ్వనుంది.
మెనూలో ఏముంటుందంటే ?
బ్లింకిట్ బిస్ట్రో వివైడ్ రేంజ్ అప్షన్స్ అందిస్తుంది. ఇందులో చాయ్, పోహా, క్రోసెంట్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్నట్లు కనిపించే ఈ యాప్ ఫాస్ట్ డెలివరీలు, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో ఇప్పటికే కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది.ఇంకా గూగుల్ యాప్ స్టోర్‌లో మంచి రేటింగ్ కూడా లభించింది. మరోవైపు Zepto కేఫ్ ఈ విభాగంలో టాప్ లో ఉంది, 10 నిమిషాల్లోనే స్నాక్స్, బేవెర్జెస్ డెలివరీ చేస్తుంది. రానున్న రోజుల్లో జెప్టో ముంబై, ఢిల్లీ NCR, బెంగళూరు, హైదరాబాద్‌తో సహా 120 నగరాలకు ఈ సర్వీస్ విస్తరించే ప్లాన్స్ కూడా ప్రకటించింది.

10-15 నిమిషాల్లోనే ఎందుకు?
ఫాస్ట్ డెలివరీలలో ఇప్పటికే ఉన్న కంపెనీలకు క్విక్ ఫుడ్ డెలివరీ కొత్త వార్ గా మారుతోంది. Blinkit, Zepto అండ్ Swiggy ప్రతి ఒక్కరు కొత్త కొత్త విధానాలతో మార్కెట్‌లో వాటా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బిస్ట్రో, జెప్టో కేఫ్ అండ్ స్విగ్గీ బోల్ట్ వంటి యాప్స్ కస్టమర్లకు ఇప్పుడు ఫోన్‌లోనే కేవలం కొన్ని ట్యాప్‌లతో హాట్ కప్ టీ లేదా కాఫీ, స్నాక్స్ లేదా ఫుడ్ ఆర్డర్ అందిస్తుంది. ఈ సేవలు వేగంగా ఇంకా ప్రముఖ నగరంలోని ప్రజలకి అందించడానికి రూపొందించారు.
జెప్టో సీఈఓ ఆదిత్ పాలిచా ఈ కొత్త సర్వీస్‌కు ప్రతిరోజూ 30,000 కంటే ఎక్కువ ఆర్డర్లు అందుతున్నాయని తెలిపారు. బిస్ట్రో గూగుల్ ప్లే స్టార్లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండగా, ఆపిల్ iOS స్టోర్‌లో అందుబాటులో లేదు.


Click it and Unblock the Notifications