Zomato Request: దేశీయ ఫుడ్ డెలివరీ స్టార్టప్ దిగ్గజం జొమాటో తాజాగా తన కస్టమర్లకు పెద్ద విజ్ఞప్తి చేసింది. మధ్యాహ్నం సమయంలో ఫుడ్ డెలివరీ ఆర్డర్లను వీలైనంత తగ్గించాలని కోరింది. వీలైతే ఆ సమయంలో ఆర్డర్లు పెట్టొద్దని పేర్కొంది.
ఈ ఏడాది అత్యధికంగా కొనసాగుతున్న వేడిమి, వడగాలులతో పాటు.. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన వినియోగదారులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. మండే ఎండలను దృష్టిలో ఉంచుకుని చాలా అవసరమైనప్పుడు మాత్రమే మధ్యాహ్నం సమయంలో ఆహారాన్ని ఆర్డర్ చేయాలని కంపెనీ యాజమాన్యం కస్టమర్లను కోరింది. ట్విట్టర్ వేధికగా కంపెనీ అధికారికంగా ఈ విన్నపాన్ని తన కస్టమర్లకు తెలిపింది.

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సర్వీస్‌లను తీవ్రమైన ఎండల రీత్యా తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. తమ డెలివరీ పార్టనర్స్ ఇబ్బందులను కంపెనీ అర్థం చేసుకోవటాన్ని కొందరు నెటిజన్లు స్వాగతిస్తున్నారు. అయితే మరికొందరికి ఈ విజ్ఞప్తి నచ్చలేదు. ఈ క్రమంలో సానుకూలంగా స్పందించిన ఒక యూజర్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు.. "ఒక్కోసారి లాభాల కంటే ముందు మనిషిగా ఉండడం సరైంది. అవును మేము ఆర్డర్ చేయము, కానీ మీరు సేవలను పూర్తిగా మూసివేయడం కంటే ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.
మరొక వినియోగదారు మాత్రం బదులుగా మీరు మీ సేవను మధ్యాహ్నానికి ఎందుకు మూసివేయకూడదు? అంటు కంపెనీని ప్రశ్నించారు. ఇదే క్రమంలో మరో యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ బ్రో, మీరు ఆహార సేవల్లో ఉన్నారు. ప్రజలు చాలా అవసరమైనప్పుడు ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. మీరు మీ ఉద్యోగుల గురించి నిజంగా శ్రద్ధ వహిస్తే.. మీరు "మధ్యాహ్నం మా సేవలు" అని పోస్ట్ చేసేవారు. మరొకరు ఆందోళనను అభినందిస్తున్నానన్నారు. అయితే లంచ్ టైమ్ ఆర్డర్‌లను డిన్నర్ సమయం వరకు వాయిదా వేయలేమన్నారు. అలా అయితే జొమాటో "అత్యంత అత్యవసర" ఆర్డర్‌లు, తక్కువ అత్యవసర ఆర్డర్‌లను గుర్తించాలన్నారు.
మరొక నెటిజన్ స్పందిస్తూ.. మీరు డెలివరీ వ్యక్తుల శ్రేయస్సు గురించి నిజంగా ఆందోళన చెందుతుంటే, వారి ప్రోత్సాహకాలను పెంచండన్నారు.


Click it and Unblock the Notifications