కరోనా ఎఫెక్ట్: 500 మంది ఉద్యోగులకు జొమాటో గుడ్ బై!

మాయదారి కరోనా మహమ్మారి ఎవరినీ వదలటం లేదు. చైనాలో ప్రారంభమైన ఈ ప్రాణాంతక వైరస్ ప్రత్యక్షంగా తీసిన ప్రాణాలకంటే పరోక్షంగా ఎక్కువ మందిని పొట్టబెట్టుకునేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధిని దూరం చేస్తోంది. తినడానికి తిండిలేక, చేద్దామంటే పనిలేక ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది మన దేశంలోనూ భారీ ప్రభావాన్నే చూపుతోంది. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన జొమాటో పై కూడా కోవిడ్ ప్రభావం పడింది. లాక్ డౌన్ విధించిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది ఈ కంపెనీ. దీన్నుంచి కొంతైనా బయట పడేందుకు జొమాటో తక్షణ చర్యలను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా కంపెనీ ఉద్యోగుల్లో 13% మందిని తొలగిస్తోంది. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా... లేదంటే మరింత ఉద్యోగాల కోత ఉంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి.

6 నెలల పాటు సగం జీతం...

6 నెలల పాటు సగం జీతం...

ప్రస్తుతం తొలగించిన ఉద్యోగులందరికీ 6 నెలల పాటు సగం వేతనం అందించనున్నట్లు జొమాటో తమ ఉద్యోగులకు తెలిపింది. ఈ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను కూడా కొనసాగించనుంది. అలాగే ఉద్యోగం పోయిన వారికి మళ్ళీ ఉద్యోగం వచ్చేంతవరకు సగం వేతనం అమలు చేస్తామని జొమాటో ఫౌండర్ అండ్ సీఈఓ దీపిందర్ గోయల్ ఉద్యోగులను ఉద్దేశించి పంపిన ఒక ఈ మెయిల్ సందేశంలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులు ఆరు నెలల పాటు సగం వేతనం లేదా ఉద్యోగం వచ్చే వరకు సగం వేతనం పొందుతారు. ఇందులో ఏది ముందు అయితే అంత వరకు ప్రయోజనం పొందుతారు. వారికి ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్స్ కూడా కొనసాగుతాయి. ఐతే ఇవి పెర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. ఇక కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారికి మాత్రం 2 నెలల తొలగింపు వేతనం అందించనున్నట్లు వెల్లడించారు.

మిగిలిన వారికి జీతాల కోతలు...

మిగిలిన వారికి జీతాల కోతలు...

ప్రస్తుతం జొమాటో లో సుమారు 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో నుంచి ప్రస్తుతం 13% మంది ఉద్యోగులు ... అంటే సుమారు 520 మంది ఉద్యోగులను తొలగించారు. ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది మార్కెటింగ్, ఈవెంట్స్, కంటెంట్ విభాగాలకు చెందిన వారే ఉన్నారు. ఇకపోతే... తొలగించిన ఉద్యోగులు పోగా మిగిలిన అందరు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. ఇది 50% వరకు ఉండటం గమనార్హం. వచ్చే 6 నెలల నుంచి 12 నెలల కాలంలో దేశంలోని రెస్టారెంట్ల లో కనీసం 25% తగ్గిపోతాయని జొమాటో అంచనా వేస్తోంది. అంటే ఆ మేరకు బిసినెస్ దెబ్బతిన్నట్లే. అందుకే, పరిస్థితులకు తగినట్లు వ్యూహాల్లో మార్పులు చేస్తున్నారు.

వర్క్ ఫ్రొం హోమ్...

వర్క్ ఫ్రొం హోమ్...

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారీగా ఖర్చులు తగ్గించుకునేందుకు జొమాటో అడుగులు వేస్తోంది. జొమాటో కు ఇండియా తో పాటు విదేశాల్లోనూ కార్యకలాపాలు ఉన్న విషయం తెలిసిందే. మొత్తంగా ఈ కంపెనీ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా 150 ఆఫీస్ లను కలిగి ఉంది. అయితే ఇక మీదట అన్ని కార్యాలయాలు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అందుకే, ఉద్యోగుల్లో చాలా మందికి వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని అమలు చేయబోతోంది. ఇందులో చాలా మందికి పూర్తిగా వర్క్ ఫ్రొం హోమ్, కొందరికి పాక్షికంగా వర్క్ ఫ్రొం హోమ్ విధానం అవలంభించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, జొమాటో కు పోటీ కంపెనీ ఐన స్విగ్గి లో కూడా ఉద్వాసన కొనసాగుతున్నట్లు సమాచారం. ఈటీ కథనం ప్రకారం సుమారు 1,000 మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+