zomato: ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు ఆవిర్భవించాయి. ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే, సమయంతో సంబంధం లేకుండా నచ్చిన ఆహారాన్ని ఇంటి వద్దకే అందిస్తున్నాయి. కేవలం ఫుడ్ డెలివరీ సంస్థలుగానే కాకుండా.. ప్రస్తుతం లేఆఫ్ లు జరుగుతున్న వేళ ఉద్యోగం కోల్పోయిన పలువురికి అండగా నిలుస్తున్నాయి. అయితే ఎండా, వానలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న డెలివరీ ఏజెంట్ల కోసం జోమాటో CEO తాజాగా శుభవార్త వినిపించారు.

విశ్రాంతితో పాటు..
డెలివరీ ఏజెంట్లు విశ్రాంతి తీసుకునేందుకుగాను 'రెస్ట్ పాయింట్ల'ను ప్రవేశపెట్టనున్నట్లు జొమాటో CEO దీపిందర్ గోయల్ ప్రకటించారు. ఈ పబ్లిక్ షెల్టర్లలో మొబైల్ రీఛార్జ్, హై స్పీడ్ వైఫై, ప్రథమ చికిత్స కిట్, వాష్ రూంలతో పాటు శుభ్రపరచిన తాగునీటిని అందించనున్నట్లు చెప్పారు. కేవలం జొమాటో సిబ్బందికి మాత్రమే కాక.. స్విగ్గీ వంటి ఇతర డెలివరీ భాగస్వాములు సైతం వీటిని వినియోగించుకోవచ్చంటూ స్వాగతం పలికారు.
వారే మూలస్తంబాలు:
"మా వ్యాపారానికి డెలివరీ భాగస్వాములే మూలస్తంభాలు. ఆ పని చాలా కష్టతరమైనది. వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఓ మెరుగైన వాతావరణం సృష్టించాలని నిర్ణయించాం. 'రెస్ట్ పాయింట్లు' వంటి సౌకర్యాల కల్పన ద్వారా వారు కొంత సమయం విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా వారు మరింత చురుకుగా తమ ఉద్యోగం చేసుకోగలరని భావిస్తున్నాం" అని గోయల్ తెలిపారు.

త్వరలోనే మరిన్ని చోట్ల:
జొమాటో ప్రధాన కార్యాలయం ఉన్న గురుగ్రామ్ లో ఇప్పటికే రెండు రెస్ట్ పాయింట్లు పనిచేస్తున్నాయి. వాటిలో ఒకదాని ఫొటోను దీపిందర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. జొమాటోతో పాటు స్పిగ్గీ డెలివరీ ఏజెంట్లు అక్కడ కూర్చుని ఉండగా, కొందరు ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవడం అందులో చూడవచ్చు. కాగా వ్యాపారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో త్వరలోనే మరిన్ని నిర్మించనున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications