ఇప్పుడే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసారా? బిల్లు కాస్త ఎక్కువ అనిపించిందా కనిపిస్తే సర్ప్రైజ్ అవ్వకండి. ఫెస్టివ్ సీజన్ రష్ మొదలవ్వకముందే Zomato, Swiggy ప్లాట్‌ఫాం ఫీజులు పెంచేశాయి. ఎందుకంటే ఇవి ఇప్పుడు కేవలం ఫుడ్ డెలివరీ మీదే ఆగిపోవడం లేదు.

Zomato ఆర్డర్ ఛార్జ్‌ని రూ. 10 నుంచి రూ.12 కి పెంచింది. సింపుల్‌గా చెప్పాలంటే ఫెస్టివ్ టైమ్‌లో ఆర్డర్లు పెరుగుతాయి కాబట్టి రెవెన్యూ కూడా పెంచుకోవాలని ప్లాన్. దీనికి వెంటనే Swiggy కూడా వెనుకాడలేదు. కొన్ని పిన్‌కోడ్‌లలో ప్లాట్‌ఫాం ఫీజును రూ. 12 నుండి రూ. 14కి పెంచింది. అయితే, ఇది శాశ్వతం కాదు. డిమాండ్ స్థిరపడిన తర్వాత మళ్లీ తగ్గించే అవకాశం ఉంది.
ఇక రెండు కంపెనీలూ ఇప్పుడు కేవలం ఫుడ్ డెలివరీ మీదే ఆధారపడడం లేదు. వీటి ఫోకస్ ఇప్పుడు క్విక్ కామర్స్ బిజినెస్ మీదే ఉంది. Zomato ప్రాఫిట్ రూ. 253 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పడిపోయినా, రెవెన్యూ మాత్రం 70% పెరిగింది. Swiggy అయితే నష్టాలు డబుల్ అయ్యి రూ. 1,197 కోట్ల వరకు చేరాయి. దీనికి ప్రధాన కారణం Instamart మీద భారీ ఇన్వెస్ట్‌మెంట్ చేయడమే. అయినప్పటికీ, దాని రెవెన్యూ 54% పెరిగింది. అంటే, ఈ రెండు కంపెనీలు బిజినెస్ గ్రోత్ కోసం ముందుగా భారీ ఖర్చు పెట్టి, తర్వాత లాభం సాధించే ప్లాన్‌తో వెళ్తున్నాయి.
ఇంతలోనే Rapido కూడా కొత్తగా రంగంలోకి దూసుకొచ్చింది. Ownly అనే పేరుతో ఫుడ్ డెలివరీ సర్వీస్ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఇది బెంగళూరు కోరమంగళ, HSR, BTM లేఅవుట్ ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ముఖ్యంగా Zomato-Swiggy రెస్టారెంట్లపై 16-30% కమిషన్ వసూలు చేస్తే, Ownly మాత్రం కేవలం 8-15% మధ్యే కమిషన్ వసూలు చేయబోతోంది.
ఫుడ్ డెలివరీ మార్కెట్ ఇండియాలో ఇప్పుడు రాకెట్ స్పీడ్‌తో పెరుగుతోంది. ఫుడ్ డెలివరీ పరిశ్రమ 2025 నాటికి సుమారు 16.56 బిలియన్లు (USD) దాకా చేరనుందంటున్నాయి, ఇది 2023-2027 మధ్య CAGR 11% రేటుతో పెరుగుతుందని అంచనా. 2024కి ఈ మార్కెట్ సైజ్ సుమారు రూ.1.5 లక్షల కోట్లకు చేరిందని అంచనా. అంటే, ఫుడ్ డెలివరీ ఇప్పుడు కేవలం సిటీ లైఫ్‌లో కాకుండా, టైర్-2, టైర్-3 టౌన్‌ల్లో కూడా బాగా పాపులర్ అవుతోంది. ఇప్పటివరకు ఈ రంగాన్ని ప్రధానంగా Swiggy, Zomato డ్యుయోపోలీగా కంట్రోల్ చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఎందుకంటే, Rapido తన Ownly సర్వీస్‌తో ఎంట్రీ ఇస్తోంది. అదనంగా, ప్రభుత్వ సపోర్ట్‌తో నడుస్తున్న ONDC ( ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) కూడా మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. ఇవి రెండూ కలిపి గేమ్‌ని పూర్తిగా మార్చే ఛాన్స్ ఉంది.
ఫెస్టివ్ సీజన్ గురించి మాట్లాడితే, ఈ టైమ్‌లో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు సాధారణ రోజులతో పోలిస్తే 25-30% వరకు పెరుగుతాయి. కుటుంబ సమావేశాలు, పార్టీల వలన ఈ డిమాండ్ మామూలుగా ఉండదు. ఇదే గ్యాప్‌ని క్యాచ్ చేసుకోవడానికి Zomato, Swiggy లాంటి కంపెనీలు ప్లాట్‌ఫాం ఫీజులు పెంచేస్తాయి. అంటే, "డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు రెవెన్యూ కూడా పెంచుకోవాలి" అనేది వీటి స్ట్రాటజీ.
మొత్తానికి, ఈ ఫెస్టివ్ సీజన్‌లో Zomato, Swiggy బిల్లులు కాస్త పెరిగినా, మార్కెట్లో Rapido లాంటి కొత్త ఆటగాళ్లు "తక్కువ కమిషన్ - తక్కువ ఖర్చు" మోడల్‌తో యూజర్లను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications