Zomato Share: దేశంలోని అతిపెద్ద ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ జొమాటో ఇన్వెస్టర్లకు ఆనందాలను తిరిగి అందిస్తోంది. మార్కెట్లోకి వచ్చిన ఈ ఐపీవో షేర్ ధర భారీగా పతనమైన సంగతి తెలిసిందే.
ఈరోజు మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో జొమాటో షేర్ ధర 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.26 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.75.95వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో ఇంట్రాడే ట్రేడింగ్ లో రూ.75.75ను చేరుకుని 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం స్టాక్ ధర ఐపీవో ధర రూ.76 స్థాయిలకు చేరుకుంది.

మార్చి 28 నుంచి జొమాటో షేర్లు దాని IPO ధర అయిన రూ. 76 దిశలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో షేర్ ధర దాదాపు 48 శాతం మేర పెరిగింది. గడచిన రెండేళ్లుగా జొమాటో కంపెనీ షేర్లు తీవ్ర అస్థిరతలో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని సానుకూల వార్తలతో షేర్ ధర పెరుగుతోంది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నమోదు చేసిన మెరుగైన పనితీరు స్టాక్ ధర పునరుద్ధరణకు మద్దతునివ్వటంలో కీలక పాత్ర పోషించిందని వెల్లడైంది.

డిసెంబరు త్రైమాసికంలో రూ.346.60 కోట్లుగా ఉన్న జొమాటో నష్టాలు.. మార్చితో ముగిసిన క్వార్టర్లో రూ.188.20 కోట్లకు తగ్గాయి. ఇదే సమయంలో Q4లో కంపెనీ ఆదాయం 70 శాతం పెరిగి రూ.2,056 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కేవలం రూ.1,211.80 కోట్లుగా ఉంది. కంపెనీ పనితీరు మెరుగుపడుతున్న తరుణంలో గ్రోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గన్ స్టాన్లీ కంపెనీ షేర్లపై ఆశాజనకంగా ఉంది. రానున్న కాలంలో స్టాక్ ధర రూ.85 టార్గెట్ చేరుకుంటుందని చెబుతోంది. ఇది ప్రస్తుత ధర కంటే దాదాపు 12 శాతం ఎక్కువ.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications