Zomato Stock: జొమాటో షేర్లకు కొత్త టార్గెట్ ధరలివే.. బల్లగుద్ది చెబుతున్న బ్రోకరేజీలు..
Zomato News: ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ జొమాటో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ లాభదాయకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ క్విక్ కామర్స్ వెంచర్ విశ్లేషకుల అంచనాలకు అందని వేగంతో ముందుకు సాగటం కంపెనీకి కలిసొస్తోంది.
దీని ఫలితంగా స్టాక్ మార్కెట్లలో జొమాటో స్టాక్స్ బలమైన పనితీరును కనబరుస్తున్నాయి. నేడు ఇంట్రాడేలో జొమాటో స్టాక్ 6 శాతానికి పైగా పెరుగుదలతో సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఇంట్రాడే పెరుగుదల కారణం ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్ల ధర రూ.280.90 వద్ద కొత్త 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. దీని తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో స్టాక్ స్వల్పంగా తగ్గి 1.27 గంటల సమయంలో రూ.266 సమీపంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

అయితే జొమాటో షేర్లు సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవటం వెనుక దాని క్విక్ కామర్స్ వెంచర్ Blinkit పెద్ద కారణంగా నిలిచింది. అవును రక్షాబంధన్ ముందురోజైన ఆదివారం నాడు బ్లింకిట్ ఆర్డర్‌లు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయనే వార్తలు కంపెనీ షేర్లను సానుకూలంగా ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో బ్లింకిట్ ప్రతి నిమిషానికి రాఖీల కోసం ఏకంగా 693 ఆర్డర్లను అందుకుని రికార్డు పనితీరును నమోదు చేసింది. ప్రజల నుంచి బ్లింకిట్ చాక్లెట్స్ వంటి ఇతర వస్తువులకు సైతం భారీగా ఆర్డర్లను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ సమయంలో ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ UBS జొమాటో షేర్లకు BUY రేటింగ్‌ను కొనసాగించింది. అలాగే టార్గెట్ ధరను బ్రోకరేజ్ హౌస్ రూ.320కి పెంచింది. దీనికి ముందు గతంలో యూబీఎస్ జొమాటోకు రూ.260 టార్గెట్ ధరగా ఇచ్చింది. అలాగే జొమాటో షేర్లపై మరో బ్రోకరేజ్ హౌస్ CLSA తన టార్గెట్ ధరను ఒక్కో షేరుకు రూ.350గా ఉంచింది.
జొమాటో షేర్ల పనితీరును పరిశీలిస్తే ఆగస్టు 21, 2023లో ఒక్కో షేరు ధర కేవలం రూ.89.72 వద్ద ఉండగా ప్రస్తుతం అది రూ.280 స్థాయికి ఎగబాకింది. అలాగే 2024లో ఇప్పటి వరకు కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు 125 శాతం రాబడిని అందించింది. ఏడాది ప్రారంభంలో జనవరి 1, 2024న జొమాటో షేర్ ధర రూ.124.50 వద్ద ఉందీ.


Click it and Unblock the Notifications