Zomato Stock: జొమాటో కంపెనీ షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో ఫోకస్‌లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి కంపెనీ నిన్న తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభదాయకంగా మారటం చాలా మంది ఇన్వెస్టర్లలో సంతోషాన్ని నింపింది. బ్లింకిట్ ఆదాయాలు పెరగటంతో పాటు లాభదాయకంగా మారేందుకు చేరువ కావటం శుభపరిణామంగా నిలిచింది.
అయితే నేడు ఈక్విటీ మార్కెట్ల ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో షేర్లు 6 శాతం మేర క్షీణించాయి. అయితే మధ్యాహ్నం 2.31 గంటల సమయానికి షేర్ ధర 4.09 శాతం క్షీణతతో రూ.186.45 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. వాస్తవానికి కంపెనీ పనితీరు ఉత్తమంగా ఉన్నప్పటికీ కంపెనీ ఈఎస్ఓపీ కింద బ్లింకిట్ లీడర్ షిప్ టీమ్, సీనియర్ ఉద్యోగులకు ఎక్కువ శాతం స్టాక్ ఆప్షన్ ప్లాన్ కింద కేటాయింపులు చేపట్టాలని చూస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం స్టాక్ ఆప్షన్ ఖర్చులు పెరుగుతున్న వేళ ఉద్యోగుల ఖర్చులు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థలు సైతం కంపెనీ పనితీరుతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బ్లింకిట్ సంస్థ క్విక్ కామర్స్ మార్కెట్లో 35-40 శాతం వాటాలను కలిగి ఉంది. కంపెనీ ఇదే జోరు కొనసాగిస్తే రానున్న కాలంలో వేగంగా 50 శాతం మార్కెట్ వాటాను అందుకోగలదని నిపుణులు చెబుతున్నారు. ఇతర పోటీదారులతో పోల్చితే బ్లింకిట్ మెరుగైన యాడ్ రెవెన్యూ జనరేట్ చేయగలదని ఇది కంపెనీ ఆదాయాల పెరుగుదలకు దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్లో అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువగా కంపెనీ ESOP ఖర్చులు పెరగటం చాలా మంది పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెడుతోందని ఎంకే గ్లోబల్ అంచనా వేసింది. బ్లింకిట్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన డార్క్ స్టోర్ల సంఖ్యను 525 నుంచి 1000కి పెంచాలని ప్లాన్ చేస్తోంది.
ఎంకే గ్లోబల్ అంచనాల ప్రకారం జొమాటో షేర్లకు BUY రేటింగ్ కొనసాగిస్తూ షేర్ టార్గెట్ ధరను రూ.230గా ప్రకటించింది. ఇందులో ఫండ్ డెలివరీ వ్యాపారానికి రూ.121, బ్లింకిట్ కు రూ.93, ఇతర పెట్టుబడులకు రూ.17 విలువను కేటాయించింది. ఇదే క్రమంలో నువామా జొమాటో షేర్లకు గతంలో ఇచ్చిన రూ.180 టార్గెట్ ధరను తాజాగా రూ.245కి పెంచుతూ BUY రేటింగ్ కొనసాగిస్తోంది. ఇక ఎలారా క్యాపిటల్ జొమాటో స్టాక్ టార్గెట్ ధరను రూ.250 నుంచి తాజాగా రూ.280కి పెంచుతూ కొనుగోలు రేటింగ్ కొనసాగిస్తోంది. మార్కెట్లోని ఇతర అనేక బ్లోకరేజ్ సంస్థలు సైతం జొమాటో స్టాక్ రేటును భారీగా పెంచాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications