Zomato share: గడచిన నెల రోజులుగా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో షేర్లు క్రమంగా లాభాపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో షేర్ దాదాపు 15 శాతానికి పైగా పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు కూడా జొమాటో షేర్లు మార్కెట్లో ఫోకస్‌లో ఉన్నాయి.
బ్లాక్ డీల్ ద్వారా 1.5 కోట్ల షేర్లు చేతులు మారటంతో షేరు నేడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక్కో షేరు రూ.59 రేటున దాదాపు 88.2 కోట్ల రూపాయలు విలువైన షేర్లు ఉదయం ట్రేడింగ్ సమయంలో చేతులు మారాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు మద్దతు చూపటంతో ఇంట్రాడేలో జొమాటో షేర్లు 8 శాతానికి పైగా లాభపడ్డాయి.

జొమాటో కంపెనీ షేర్లకు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సిటీ "BUY" రేటింగ్ ఇచ్చింది. కంపెనీ షేర్లకు రూ.76ను టార్గెట్ ధరగా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో షేర్ ఉన్న ధర కంటే టార్గెట్ ధర 35 శాతం ఎక్కువ. ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లు డైనింగ్-అవుట్ విభాగంలో మానిటైజేషన్‌ను ప్రవేశపెట్టాయి. మీడియం టర్మ్‌లో ఇది సానుకూల ఫలితాలను అందిస్తాయని సిటీ బ్యాంక్ అంచనా వేస్తోంది.
మూడో త్రైమాసికంలో కంపెనీ తన ఫుడ్ డెలివరీ ఆర్డర్లలో 10 శాతం క్షీణతను నమోదు చేసింది. కొవిడ్ తర్వాత కస్టమర్లు తమ ధోరణిని మార్చుకున్నారు. ప్రధానంగా వారు డైన్-అవుట్ మోడల్‌కు షిఫ్ట్ అవుతున్నారని ట్రెండ్ సూచిస్తోంది. దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సైతం BUY రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.70గా నిర్ణయించింది. కంపెనీ FY25లో లాభదాయకంగా మారడం ద్వారా బలమైన వృద్ధిని పూర్తి చేయాలని ఆశిస్తోంది.
డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు చెల్లింపు విధానంలో మార్పును నిరసిస్తూ ఇటీవల ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కంపెనీకి చెందిన 100కి పైగా బ్లింకిట్ స్టోర్‌లు మూతపడ్డాయి. అయితే కంపెనీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో స్టోర్లను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి 3.57 శాతం లాభపడి రూ.58 వద్ద ట్రేడింగ్ ముగించింది.


Click it and Unblock the Notifications