ఏప్రిల్‌లో ఐపీఓ ద్వారా వాటాలను విక్రయించే యోచనలో జొమాటో... $650 మిలియన్ టార్గెట్..?
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐపీఓ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐపీఓ ద్వారా 650 మిలియన్ డాలర్లను సేకరించాలనే లక్ష్యంతో జొమాటో ఉంది. దీపిందర్ గోయల్‌కు చెందిన ఈ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ... ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు బ్లూంబర్గ్ పత్రిక కథనం ప్రచురించింది.ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతందని తెలుస్తోంది. ఇక ఏ మేరకు వాటాలు విక్రయించాలి, ఎంత గడువు ఇవ్వాలనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే జొమాటో సంస్థ దీన్ని అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు.
గత నెలలో జొమాటో ఐదు ఇన్వెస్టర్ల నుంచి 250 మిలియన్ డాలర్లను సేకరించింది. ఇందలో కోరా మేనేజ్‌మెంట్ ఎల్‌పీ నుంచి 115 మిలియన్ డాలర్లను సేకరించగా... ఫిడిలిటీ మేనేజ్‌మెంట్ & రీసెర్చ్ కంపెనీ తన అనుబంధ సంస్థల నుంచి మరో 55 మిలియన్ డాలర్లు సేకరణ చేపట్టింది. ఇక టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ నుంచి 50 మిలియన్ డాలర్లు చేపట్టగా, 20 మిలియన్ డాలర్లు బో వేవ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ నుంచి సేకరించింది. డ్రాగనీర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ నుంచి 10 మిలియన్ డాలర్లు సేకరించింది.

ఇదిలా ఉంటే జొమాటో గత ఏడాది సెప్టెంబరులో టైగర్ గ్లోబల్ మరియు టెమాసెక్ హోల్డింగ్స్ యొక్క అనుబంధ సంస్థ మాక్‌రిచీ ఇన్వెస్ట్‌మెంట్స్ నుండి 160 మిలియన్ డాలర్లు సేకరించింది, దీని విలువ 3.3 బిలియన్ డాలర్లు. ఇది జనవరి 2020 లో 150 మిలియన్ డాలర్లను కూడా సేకరించింది. ఐపీఓ సేకరణ ద్వారా బహిరంగ మార్కెట్లో జొమాటో కంపెనీ విలువ 6 నుంచి 8 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనే లక్ష్యం పెట్టుకుంది. ఇక ఐపీఓ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు గోల్డ్ మాన్ శాక్స్, కొటాక్ మహీంద్ర బ్యాంక్, మోర్గాన్ స్టాన్‌లే మరియు క్రెడిట్ సుఇస్ లాంటి దిగ్గజ సంస్థలను నియమించుకుంది.
2008లో ప్రారంభమైన జొమాటో సంస్థలో ప్రస్తుతం 5వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో జొమాటో యొక్క రెవిన్యూ రూ.2605 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అంటే 2019లో రూ.1312.6 కోట్లుగా ఉన్నింది.


Click it and Unblock the Notifications