Zomato Share: ఉద్యోగులకు కూడా కంపెనీలు తమ కంపెనీల్లో వాటాలను, లాభాలను అందిస్తున్నాయి. తమ సంస్థల్లో కార్మికులను సైతం యజమానులుగా చేసేందుకు స్టాక్స్ అందిస్తున్నాయి. తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా ఇలాంటి సంచల నిర్ణయం తీసుకుంది. లాక్ ఇన్ పిరియడ్ ముగియటంతో నష్టాలను చవిచూసిన స్టాక్ నేడు పుంజుకుంది. ఎనలిస్టులు కంపెనీ పనితీరుపై పాజిటివ్ అవుట్ లుక్ ఇవ్వటం ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపింది.

రూపాయికే జొమాటో షేర్..
ఫుడ్ డెలివరీ స్టార్టప్ Zomato గత రెండు రోజులుగా తన షేర్లు 21 శాతం విలువను కోల్పోయిన నేపథ్యంలో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ESOP) పూల్ నుంచి 4.66 కోట్ల షేర్లను కేవలం ఒక్కోటి రూ.1 కే ఉద్యోగులకు కేటాయించింది. ప్రస్తుతం మార్కెట్లో షేర్ ట్రేడవుతున్న ధర ప్రకారం.. కేటాయింపు విలువ సుమారు రూ.200 కోట్లుగా ఉంది. Zomato షేర్లు ప్రస్తుతం రూ.42.95 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే ఉద్యోగులకు 98 శాతం డిస్కౌంట్ కు స్టాక్స్ ఇస్తున్నందున అవి కేవలం రూపాయికే లభిస్తోంది.

కంపెనీ బోర్డు కీలక నిర్ణయం..
వెస్టెడ్ స్టాక్ ఆప్షన్ల అమలు ద్వారా ఉద్యోగులకు 4,65,51,600 ఈక్విటీ షేర్ల పంపిణీకి కంపెనీ అంగీకరించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నామినేటింగ్ అండ్ కంపెన్సేషన్ కమిటీ సిఫార్సులను ఆమోదించినట్లు కంపెనీ జూలై 26న తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

మార్కెట్ నిపుణుల మాటేంటి..
మరో నాలుగు రోజుల్లో కంపెనీ తన ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. అయితే.. ఈ వారంలో కంపెనీ షేర్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జొమాటో స్టాక్ లాక్ ఇన్ పిరియడ్ ముగిసిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. అయితే.. ఎనలిస్టులు రానున్న రోజుల్లో కంపెనీ లాభాల బాట పడుతుందని.. ఇన్వెస్టర్లకు మంచి రాబడిని ఇస్తుందని అంటున్నారు.

గరిష్ఠంగా 169కి..
నవంబర్ 16, 2021న Zomato స్టాక్ రికార్డు గరిష్ఠ స్థాయి అయిన రూ.169.10 తాకింది. అయితే ఇటీవలి వారాల్లో దీని ధర గణనీయంగా తగ్గుతోంది. ప్రధానంగా జొమాటో బోర్డ్ Blinkit వ్యాపారాన్ని కొనాలని నిర్ణయాన్ని ప్రకటించిన నాటి నుంచి షేర్ విలువ దాదాపు 30 శాతం వరకు క్షీణించింది. కంపెనీ ఇందుకోసం రూ.4,447 కోట్లను వెచ్చించాలని భావించింది. బ్లింకిట్ కొనుగోలు నిర్ణయంపై ఇన్వెస్టర్లు గుర్రుగా ఉన్నారు.

డెలివరీ ఏజెంట్ల పిల్లల కోసం..
Zomato చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపిందర్ గోయల్ FY22లో.. తనకు ESOP ద్వారా వచ్చిన రూ.700 కోట్ల విలువైన షేర్లను జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ మెుత్తం నిధులను డెలివరీ ఏజెంట్ల పిల్లల చదువుల కోసం వెచ్చించనున్నట్లు తె
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications