For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zomato listing: లిస్టింగ్‌లో జొమాటో అదరగొట్టింది, రూ.1 లక్ష కోట్లు దాటిన ఎం-క్యాప్

|

డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ షేర్లు నేడు (జూలై 23 శుక్రవారం) లిస్టింగ్ అయ్యాయి. వాస్తవానికి జొమాటో షేర్లు మంగళవారం నమోదు కావాల్సి ఉంది. రెండు వర్కింగ్ డేస్ ముందుకు జరపడం గమనార్హం. ఇందుకు షేర్ల కేటాయింపు ప్రక్రియను సంస్థ గురువారమే పూర్తి చేసింది. రూపాయి ఫేస్ వ్యాల్యూ కలిగిన షేరును రూ.75 ప్రీమియంతో రూ.76 చొప్పున కంపెనీ కేటాయించింది. 2021 జూలై 23న జొమాటో ఈక్విటీ షేర్లు నమోదయ్యాయి.

పదకొండేళ్లలో అధికం

పదకొండేళ్లలో అధికం

2021 జులై 23న జొమాటో ఈక్విటీ షేర్లు నమోదవుతాయని, బి-గ్రూప్ సెక్యూరిటీస్ గ్రూపులో ఈ షేర్ల ట్రేడింగ్‌కు అనుమతినిచ్చామని బీఎస్ఈ నిన్ననే తెలిపింది. గత శుక్రవారం అంటే 16వ తేదీన జొమాటో ఐపీఓ ముగిసింది. ఇది 40.38 రెట్ల స్పందన లభించింది. 2020 మార్చి తర్వాత అధిక నిధులు సమీకరించిన ఐపీఓ ఇది కావడం గమనార్హం. దాఖలైన బిడ్స్ వ్యాల్యూ రూ.2.13 లక్షల కోట్లు. 11 ఏళ్ల మార్కెట్ చరిత్రలోనే ఇది అధికమని అంటున్నారు.

లిస్టింగ్ అదరహో

లిస్టింగ్ అదరహో

జొమాటో షేర్లు నేడు లిస్టింగ్ అయ్యాయి. షేర్ ధర బీఎస్ఈలో రూ.115 వద్ద ప్రారంభమైంది. ఐపీఓ ధర రూ.76తో పోలిస్తే 51.32 శాతం ప్రీమియంతో నమోదయింది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈలో 53 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద లిస్ట్ అయింది. దీంతో లిస్టింగ్ సమయంలో ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,08,067.35 కోట్లు దాటింది.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బీఎస్‌ఈలో టాప్ 50 జాబితాలో జొమాటో చేరింది. ప్రారంభంలో బీఎస్‌ఈలో 42 లక్షల షేర్లు చేతులు మారింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో 19.41 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం గం.1 సమయానికి జొమాటో షేర్ 65556 శాతం ఎగిసి రూ.126 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం 10:17 గంటల సమయంలో బీఎస్‌ఈలో జొమాటో షేర్ 72 శాతం ఎగబాకి 131 వద్ద ట్రేడ్ అయింది. ఓ దశలో రూ.138 వరకు ఎగబాకి, అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.

జొమాటోకు ఆదరణ లభిస్తే..

జొమాటోకు ఆదరణ లభిస్తే..

వివిధ ఫిన్‌టెక స్టార్టప్స్ ఐపీఓకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నాయి. దీంతో జొమాటోకు ఆదరణ లభిస్తే వాటన్నింటికీ బూస్టింగ్ లభిస్తుంది. లిస్టింగ్‌కు కొద్దిముందు జొమాటో వ్యవస్థాపకులు షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. సంస్థ భవిష్యత్తు మనుగడపై విశ్వాసం వ్యక్తం చేశారు. జొమాటోతో పాటు స్విగ్గీ కూడా ప్రపంచస్థాయి సంస్థలుగా ఎదగాలన్నారు.

English summary

Zomato listing: లిస్టింగ్‌లో జొమాటో అదరగొట్టింది, రూ.1 లక్ష కోట్లు దాటిన ఎం-క్యాప్ | Zomato listing: Share above Rs 125, M Cap hits RS 1 lakh crore

Zomato shares made a strong stock market debut on Friday, listing at Rs 115 apiece on BSE.
Story first published: Friday, July 23, 2021, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X