Zomato: ఆహార ప్రియులకు ఇకపై దూరం అడ్డుకాదంటోంది జొమాటో. మనం సహజంగా నచ్చిన వంటకాలను తినేందుకు ఇష్టమైన రెస్టారెంట్స్ కోసం మహా అయితే పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటాం. అయితే నగరాలకు నగరాలనే దాటడం అంటే అది అసాధ్యం కూడా. కానీ ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే సర్వీసెస్ ను దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం సుసాధ్యం చేసి చూపిస్తానని అంటోంది. దీనికి అవసమరమైన కార్యాచరణను సైతం ప్రారంభించింది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే..
ఇంటర్‌సిటీ లెజెండ్స్..
జొమాటో తాజాగా ఇంటర్‌సిటీ లెజెండ్స్ అనే కొత్త డెలివరీ సర్వీసును దేశంలో పరిచయం చేస్తోంది. దీని ద్వారా ఇతర నగరాల్లో ఫేమస్ రెస్టారెంట్ల నుంచి వంటకాలను ఆర్డర్ చేసుకునే వెసులుబాటును భోజన ప్రియులకు పరిచయం చేస్తోంది. అయితే డెలివరీ కొన్ని సందర్భాల్లో ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతానికి Zomato ఈ డెలివరీ ఎంపికను కేవలం గుర్గావ్, దక్షిణ ఢిల్లీ కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తోంది. అంటే ఈ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే 'ఇంటర్‌సిటీ' ఆర్డర్‌లను ఇవ్వగలరు.

ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు?
కొత్త సర్వీస్ ద్వారా కస్టమర్లు " జైపూర్ నుంచి కచోరీ, కోల్‌కతా నుంచి కాల్చిన రోసోగొల్లాస్, హైదరాబాద్ నుంచి బిర్యానీ, బెంగళూరు నుంచి మైసూర్ పాక్, లక్నో నుంచి కబాబ్‌లు, ఓల్డ్ ఢిల్లీ నుంచి బటర్ చికెన్ లేదా ప్యాజ్ వంటి ఫేమస్ వంటకాలను ఆర్డర్ చేసి ఆస్వాధించడానికి వెసులుబాటు ఉంటుందని." జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ జాబితాలో కోల్‌కతా, హైదరాబాద్, లఖ్నో, జైపూర్, బెంగళూరు, మధుర, చెన్నై, ఆగ్రా, భువనేశ్వర్ నుంచి కస్టమర్లు ఇష్టమైన ఫుడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు.

అన్ని రెస్టారెంట్లకు అనుమతి ఉంటుందా..?
అనుమతించబడిన జాబితాలోని నగరాల్లోని అన్ని రెస్టారెంట్లు ఈ సర్వీస్ కింద అనుమతించబడవు. కేవలం ఎంపిక చేసిన కొన్నింటికే ఈ అవకాశాన్ని జొమాటో అందిస్తోంది. ఉదాహరణకు లఖ్నోలో కేవలం ఏడు రెస్టారెంట్లు మాత్రమే ఈ జాబితాలో కనిపించాయి. అవి కూడా అత్యధికంగా అమ్ముడైన, ఫేమస్ వంటకాలు మాత్రమే సర్వ్ చేయబడతాయి.

స్పెషల్ ప్యాకింగ్..
ఇతర నగరాలకు ఆహారాన్ని విమానం ద్వారా పంపటం జరుగుతుంది. రెస్టారెంట్ తాజాగా ఆహారాన్ని సిద్ధం చేసిన తరువాత.. సురక్షితంగా రవాణా చేసేందుకు రీయూజబుల్, ట్యాంపర్ ఫ్రూఫ్ కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ఆహారం చెడిపోకుండా ఉంచేందుకు అత్యాధునిక మొబైల్ శీతలీకరణ సాంకేతికతను వినియోగిస్తారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపబోమని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు ఆహారాన్ని అందుకున్న తరువాత "మైక్రోవేవ్, ఎయిర్-ఫ్రై లేదా పాన్-ఫ్రై" వినియోగించి హాట్ గా సర్వ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ పనిలో దేశంలోని 100 విమానాశ్రయాలు పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications