Zomato: బెంగళూరులోని వేగా సిటీ మాల్‌లో డెలివరీ భాగస్వాముల కోసం జొమాటో కొత్త విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణ భారతదేశంలో ఇదే ఈ తరహా తొలి ఫెసిలిటీగా పేర్కొంది. ఈ కార్యక్రమంలో బెంగళూరు సౌత్ MP తేజస్వి సూర్య కూడా పాల్గొన్నారు. డెలివరీ భాగస్వాములందరికీ ప్రథమ చికిత్స, స్పష్టమైన రెస్ట్‌రూమ్‌లు మరియు తాగునీరు వంటి అవసరమైన సౌకర్యాలను అందించే విశ్రాంతి పాయింట్ ప్రాముఖ్యతను గురించి ఆయన ట్వీట్ చేశారు.
"@zomato & @vegacitysocial సహకారంతో వేగా సిటీ మాల్‌లో డెలివరీ పార్ట్‌నర్‌ల కోసం విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డెలివరీ భాగస్వాములందరికీ విశ్రాంతి, పునరుజ్జీవనం మరియు రీఛార్జ్ కోసం ఇదొక ప్రదేశంగా ఉపయోగపడుతుంది" అని ట్విట్టర్ వేదికగా MP వెల్లడించారు. ఈ విశ్రాంతి పాయింట్లను ఇతర బ్రాండ్‌ల డెలివరీ భాగస్వాములు కూడా యాక్సెస్ చేయవచ్చని జొమాటో ఫిబ్రవరిలోనే ప్రకటించింది.

"'ది షెల్టర్ ప్రాజెక్ట్'ను ప్రకటిస్తున్నాము. వివిధ కంపెనీల డెలివరీ భాగస్వాముల శ్రేయస్సుకు తోడ్పడేందుకు పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (రెస్ట్ పాయింట్స్) నిర్మాణాన్ని ప్రారంభించాము" అని జొమాటో CEO గోయల్ ఒక ట్వీట్‌లో తెలిపారు. డెలివరీ ఏజెంట్లు తమ వ్యాపారానికి గుండె, ఆత్మగా ఆయన అభివర్ణిచారు.
డెలివరీ భాగస్వాములు హై-స్పీడ్ ఇంటర్నెట్, వాష్‌రూమ్, ప్రథమ చికిత్స, తాగునీరు మరియు ఫోన్ ఛార్జింగ్ పాయింట్‌ను యాక్సెస్ చేయగలరు. దేశవ్యాప్తంగా ఇలాంటి మరిన్ని షెల్టర్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రణాళికలను కలిగి ఉంది. జోమాటో ప్రధాన కార్యాలయం ఉన్న గుర్గావ్‌లో ఇప్పటికే ఇలాంటి కొన్ని విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.


Click it and Unblock the Notifications