For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రోసరీ డెలివరీ నుంచి తప్పుకుంటున్న జొమాటో?

|

ప్రముఖ ఫుడ్ డెలివరీ స్టార్టుప్ కంపెనీ జొమాటో... గ్రోసరీ డెలివరీ సర్వీసుల నుంచి తప్పుకోనుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఫుడ్ డెలివరీ లో పట్టు సంపాదించి దేశంలో ఆ రంగంలో స్విగ్గి తో పోటీ పడుతోంది. అయితే ఇటీవలే గ్రోసరీస్ డెలివరీ విభాగంలోకి కూడా అడుగిడింది.

దేశంలోని సుమారు 80 నగరాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది కూడా. కానీ అంతలోనే మళ్ళీ సర్వీసులను నిలిపివేస్తుండటం గమనార్హం. జొమాటో మార్కెట్ అనే బ్రాండ్ కింద ప్రారంభించిన గ్రోసరీ సర్వీసుల నిలిపివేత చాలా మంది విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది నిజానికి ఆశ్చర్యానికి గురిచేసే విషయమే అయినా... చిన్న పట్టణాల్లో జొమాటో తన జొమాటో మార్కెట్ సేవలను తగ్గిస్తూ వస్తోంది.

ప్రతి డెలివరీ పైనా నష్టాన్ని చవిచూస్తుండటంతో పాటు నష్టాలను తగ్గించుకొని తన కోర్ బిజినెస్ పై ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లు ఉంది అని ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి చెప్పినట్లు ఎంట్రాకర్ వెల్లడించింది.

ఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరికఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరిక

స్విగ్గి తో పోటీ లో భాగమే...

స్విగ్గి తో పోటీ లో భాగమే...

ఫుడ్ డెలివరీ లో దేశంలో స్విగ్గి, జొమాటో రెండు మాత్రమే రేసులో ఉన్నాయి. దీంతో పోటీదారు ఒకరు ఏ పని చేస్తే సరిగ్గా అదే పనిని మరో కంపెనీ కూడా ప్రారంభించటం సర్వ సాధారణం. స్విగ్గి దాదాపు ఏడాది కాలంగా గ్రోసరీస్ డెలివరీ చేపడుతోంది. ఫుడ్ బిజినెస్ లో తగ్గుతున్న వ్యాపారాన్ని గ్రోసరీస్ తో పూడ్చుకోవాలని స్విగ్గి దానిని ప్రారంభించి. కాబట్టి, వెంటనే సరిగ్గా అదే బిజినెస్ విభాగాన్ని జొమాటో కూడా ప్రారంభించింది. కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ వల్ల ఫుడ్ బిజినెస్ బాగా దెబ్బతింది. సరిగ్గా ఇదే సమయంలో గ్రోసరీస్ బిజినెస్ బాగా పుంజుకుంది. అందుకే స్విగ్గి ఈ విభాగంపై ఫోకస్ పెంచింది. అయితే గ్రోసరీస్ డెలివరీ కి ప్రత్యేక వ్యాపార వ్యూహాలు అవసరమవుతాయి. ఇప్పుడున్న వ్యవస్థతోనే గ్రోసరీస్ కూడా డెలివరీ చేయటం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని జొమాటో గుర్తించినట్లుంది.

ఆల్కహాల్ డెలివరీ కూడా...

ఆల్కహాల్ డెలివరీ కూడా...

లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఫుడ్ డెలివరీ పై నిషేధం కొనసాగింది. దీంతో స్విగ్గి, జొమాటో రెండూ కూడా బాగా దెబ్బతిన్నాయి. 70-80% ఆర్డర్లు పడిపోవటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఈ కంపెనీలు కొత్త విభాగాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా స్విగ్గి, జొమాటో ఆల్కహాల్ హోమ్ డెలివరీ సేవలను కూడా ప్రారంభించాయి. ఛత్తీస్గఢ్ సహా మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లిక్కర్ డెలివరీ కి అనుమతించడంతో ఇందులోకి ప్రవేశించాయి. అయితే, లిక్కర్ డెలివరీ సేవలను ఎంత కాలంపాటు ప్రభుత్వాలు అనుమతిస్తాయో తెలియదు. మధ్యలో మళ్ళీ అనుమతులను రద్దు చేస్తే ఇవి కొత్త వ్యాపార అవకాశాలను వెతుక్కోవాల్సి ఉంటుంది.

సేవలు కొనసాగుతాయి...

సేవలు కొనసాగుతాయి...

ఇదిలా ఉండగా... జొమాటో మార్కెట్ సేవల నిలిపివేత గురించి ఎంట్రాకర్ వివరణ కోరగా... ఆ సేవలు కొనసాగుతాయని కంపెనీ బదులిచ్చింది. కానీ ఇతర వివరాలు వెల్లడించలేదు. అదే సమయంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని సేవలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఫుడ్ డెలివరీ సేవలపై ద్రుష్టి సారించామని, వినియోగదారులకు శుభ్రత, భద్రత లతో కూడిన భోజనం డెలివరీ చేయటంపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నామని జొమాటో వివరణ ఇచ్చింది. కాగా, ప్రముఖ గ్రోసరీ సేవల సంస్థ గ్రోఫెర్స్ తో కూడా జొమాటో విలీన చర్చలు జరుగుతున్నట్లు కొంత కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. కానీ అందులో పెద్దగా పురోగతి లేదని తెలుస్తోంది.

English summary

గ్రోసరీ డెలివరీ నుంచి తప్పుకుంటున్న జొమాటో? | Zomato is planning to shut its newly launched grocery delivery service

Zomato is planning to shut its newly launched grocery delivery service, Zomato Market, said two sources aware of the development. This comes as a surprise as the foodtech unicorn was on its way to expand the grocery delivery operations and recently announced that it is available in 80 plus cities in India.
Story first published: Saturday, June 6, 2020, 19:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X