Zomato large fleet: కొత్త కొత్త సర్వీసులను ప్రవేశపెడుతూ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని యూజర్ల ఆగ్రహానికి గురికాగా మరికొన్ని వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటున్నాయి. తాజాగా జొమాటో ఇలాంటిదే ఓ కొత్త సేవను ప్రారంభించడానికి రెడీ అయింది.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా 'లార్జ్ ఫ్లీట్ ఆర్డర్'ని ప్రారంభించినట్లు జోమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపిందర్ గోయల్ ప్రకటించారు. గరిష్ఠంగా 50 మందికి సరిపోయే విధంగా గ్రూప్ లేదా పార్టీ ఈవెంట్‌లకు ఆర్డర్ల సప్లై నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ విభాగం మొత్తం పూర్తిగా ఎలక్ట్రిక్ ఫ్లీట్ ని కలిగి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు Xలో ఓ పోస్ట్ చేశారు.

ఇంతకుముందు ఈ తరహా పెద్ద ఆర్డర్‌లను పలువురు సాధారణ డెలివరీ భాగస్వాములు నిర్వహించేవారని గోయల్ గుర్తుచేశారు. అయితే కస్టమర్ అనుభవం సంస్థ ఆశించిన స్థాయిలో లేదన్నారు. అందుకే కొత్త వాహనాల ద్వారా ఈ తరహా పెద్ద ఆర్డర్లను డెలివరీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను ఇది పరిష్కరించగలదని భావిస్తున్నట్లు వెల్లడించారు.
'కూలింగ్ కంపార్ట్‌మెంట్‌లు మరియు ఎయిర్ కండీషన్‌తో కూడిన హాట్ బాక్స్‌లతో కూడిన వాహనాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మేము వాటికి మరిన్ని మెరుగులుదిద్దే ప్రక్రియలో ఉన్నాము. అనుకున్న విధంగా ప్రతి వాహనాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాం. మా కమ్యూనిటీకి మెరుగైన సేవలు అందించే ప్రయత్నాల్లో ఇదొకటి' అని దీపిందర్ వివరించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications