Zomato News: కార్పొరేట్ ఎంప్లాయూస్ కోసం జొమాటో కొత్త ఫీచర్.. ఆర్డర్ మీది, బిల్లు వాళ్లది
Zomato For Enterprise: దినదినాభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ మరింత కొత్త రూపు సంతరించుకుంటోంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కస్టమర్లకు కావాల్సిన పర్‌ఫెక్ట్ ఫీచర్లను ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన యాప్‌లో చొప్పిస్తోంది. ఇటీవలే రెండు రోజులకు ముందుగానే ఫుడ్ డెలివరీ షెడ్యూల్ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. యాప్ లో తీసుకొస్తున్న కొత్త కొత్త ఆలోచనలకు కస్టమర్లు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే జోష్‌తో కార్పొరేట్లకు సేవలందించేందుకు సిద్ధమైంది.
కంపెనీ తాజాగా 'జొమాటో ఫర్ ఎంటర్‌ప్రైజెస్' అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇందులో కార్పొరేట్ ఉద్యోగులు బిజినెస్ రిలేటెడ్ ఆర్డర్స్ పెట్టేందుకు అవకాశం కల్పించింది. ఆయా కంపెనీల ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ మేనేజ్మెంట్‌ను సులభతరం చేసేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు CEO దీపిందర్ గోయల్ X వేదిక గా ప్రకటించారు. కార్పొరేట్స్ అందించే రియంబర్స్మెంట్ ప్రాసెస్ ను ఈజీ చేసేందుకు తాము సాయపడతామన్నారు.

జొమాటోలో కార్పొరేట్ ఉద్యోగులు చేసే ఆర్డర్స్ చాలావరకు బిజినెస్ రిలేటెడ్ అని, వాటికి సదరు కంపెనీ తిరిగి రియంబర్స్ చేయాల్సి వస్తుందని తెలిపారు. తాజా ఫీచర్ తో సమయంతో పాటు రియంబర్స్మెంట్ బాధ్యత కూడా సమర్థవంతంగా మేనేజ్ చేయవచ్చన్నారు. జొమాటోలో ఉద్యోగులు నేరుగా తమ యజమానులకే బిల్ చేయవచ్చని గోయల్ తెలిపారు. తద్వారా కార్పొరేట్లు కొత్త ఉద్యోగులను దీనికి యాడ్ చేయడంతో పాటు ఆర్డర్లకు బడ్జెట్ మరియు ఆర్డర్లపై రూల్స్ పెట్టే ఆప్షన్ ఉందన్నారు. కార్పొరేట్ ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనకరమని, అత్యంత పారదర్శకతతో తాము ఆర్డర్లను ప్రాసెస్ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే 100 టాప్ కంపెనీలు కొత్త ఫీచర్‌ను వినియోగిస్తున్నాయి. మరింత మంది ఉపయోగించాలని వారు సూచించినట్లు గోయల్ చెప్పుకొచ్చారు. వారిచ్చిన సలహాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, ఈ ఫీచర్‌ను మరింత సమర్థవంతంగా మార్చినట్లు వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్‌ను వినియోగించాలని కార్పొరే ట్ లీడర్లను ఆయన కోరారు. ఇందుకోసం [email protected] మెయిల్ IDపై సంప్రదించాలని రిక్వెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications