జొమాటోలో కొత్త ఆప్షన్.. పలు రెస్టారెంట్‌ల నుంచి ఒకేసారి ఆర్డర్స్.. ONDCలో పిన్‌కోడ్ ఫీచర్ కాపీ
Zomato: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇంట్లో వంట చేయడానికి కొంతమేర ఫుల్‌స్టాప్ పడింది. అనేక ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీనికితోడు పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకుంటూ కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి. జొమాటో తాజాగా తీసుకొచ్చిన ఫీచర్ ఫుడ్ లవర్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది.
జొమాటో వినియోగిస్తున్న వ్యక్తి ఇప్పటి వరకు ఒక ఆర్డర్‌లో ఒకే రెస్టారెంట్ నుంచి ఆహారపదార్థాలను ఆర్డర్ చేయాల్సి ఉంది. వివిధ రెస్టారెంట్స్‌లో లభించే ఐటమ్స్ అన్నింటినీ ఒకే ఆర్డర్‌లో పెట్టడం కుదరదు. ఈ విషయంలో యూజర్ల ఇబ్బందిని గమనించిన జొమాటో.. ఈ ఆసక్తికరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకే సమయంలో మల్టిపుల్ రెస్టారెంట్‌ల నుంచి ఆర్డర్ చేయవచ్చు.

ONDCలోని పిన్‌కోడ్ నుంచి ప్రేరణ పొంది.. ఈ ఫీచర్‌ను జొమాటో ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఇప్పుడు వివిధ రెస్టారెంట్‌ల నుండి నాలుగు కార్ట్‌లను క్రియేట్ చేయవచ్చు. చివరికి వారు ఇష్టపడే ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు. ఒక కార్ట్ అనంతరం మరో కార్ట్‌లో ఆర్డర్ చేయడం కొనసాగించవచ్చు. పెద్ద మొత్తంలో మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను రూపొందించింది.
పిన్‌కోడ్ లాంచ్ సందర్భంగా మల్టీ-కార్ట్ ఫీచర్‌ను PhonePe CEO సమీర్ నిగమ్ నొక్కిచెప్పారు. ఇది షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని, అమ్మకాలను పెంచడానికి దారితీస్తుందని తెలిపారు. ఇప్పుడు జొమాటో సైతం ఈ ఫీచర్ చొప్పించడంతో యుజర్ల నుంచి కొనుగోళ్లు పెరుగుతాయని, తద్వారా పోటీదారుల నుంచి మరింత మార్కెట్ వాటాను పొందే అవకాశం ఉందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications