Food delivery: ఆర్డర్ చేసిన ఆహారాన్ని ఇంటివద్దకే అందిస్తూ ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్స్ పెద్దమొత్తంలో సంపాదిస్తున్నాయి. తాజాగా జొమాటో కొత్త సంవత్సరంలో తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మరింతగా రెవెన్యూ పెంచుకునేందుకు భారీ స్కెచ్ వేసింది.
ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును కీలక మార్కెట్‌లలో రూ.3 నుంచి రూ.4కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఖర్చులు మరియు సంభావ్య GST ప్రభావం వల్ల ఈ మార్పు తప్పదని అభిప్రాయపడింది. జనవరి 1, 2024 నుంచి ఇది అమలులోకి వస్తున్నట్లు తెలిపింది.

తాజాగా తన ప్లాట్ ఫారమ్ ఫీజును 33 శాతం పెంచగా.. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ రేటును తాత్కాలికంగా 9 చొప్పున వసూలు చేసింది. జొమాటో మొదటగా ఆగష్టు 2023లో ఫ్లాట్ ప్లాట్‌ఫారమ్ రుసుమును ప్రవేశపెట్టింది. 2తో ప్రారంభించి ఆపై దానిని 3కి, తాజాగా 4కి పెంచింది.
ఇటీవల GST విభాగం నుంచి 402 కోట్ల మేరకు పన్ను నోటీసును జొమాటో అందుకుంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2022 మధ్య వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని కంపెనీ వాదించింది. అయితే ప్రస్తుత ఫీజు పెరుగుదల.. డెలివరీ ఛార్జీలపై GST ప్రభావంలో దాదాపు 25 శాతాన్ని భర్తీ చేయగలదని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications