Zomato: జొమాటో యూజర్ల కోసం కొత్త ఫీచర్.. నిజంగా పెద్ద వరమే ఫుడ్ లవర్స్..
Zomato News: ప్రస్తుతం ఫుడ్ డెలివరీ రంగంలో రారాజుగా కొనసాగుతున్న స్టార్టప్ కంపెనీ జొమాటో తన ప్రయాణాన్ని ప్రారంభించి నేటి 16 ఏళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలో కంపెనీ అనేక ఒడిదొడుకులతో కూడిన ప్రయాణాన్ని కొనసాగించింది. అలాగే అనేక కొత్త వ్యాపారాలకు సైతం విస్తరించింది. వినియోగదారులకు సేవల్లో నాణ్యతను పెంచాలని చూస్తున్న కంపెనీ ఎప్పటికప్పుడు తదనుగుణంగా మార్పులు తీసుకొస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే మనలో చాలా మంది కోరుకునే ఒక రహస్య ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జొమాటో ప్రకటించింది. అదే యూజర్లు తమ ఆర్డర్ హిస్టరీని తొలగించగల సామర్థ్యం. ఆర్డర్ హిస్టరీ నుంచి అతని అర్ధరాత్రి ఫుడ్ క్రేవింగ్ సాక్ష్యాలను తుడిచివేయాలని కోరుకునే కస్టమర్ల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని తాము ఈ ఫీచర్ రోల్ చేసినట్లు కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే దీనిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని గోయల్ ప్రతి ఒక్కరికి సూచించారు.

దీనిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జొమాటోలోని వివిధ సిస్టమ్‌లు, మైక్రోసర్వీస్‌లపై దీని ప్రభావం కారణంగా ఈ ఫీచర్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి, రూపొందించడానికి కొంత సమయం పట్టిందని గోయల్ పేర్కొన్నారు. ట్విట్టర్లో గోయల్ ఒక వినియోగదారుని రిక్వెస్ట్ పై స్పందిస్తూ.. మీరు ఇప్పుడు జొమాటోలో ఆర్డర్ హిస్టరీ నుంచి మీ ఆర్డర్‌లను తొలగించవచ్చు. దీన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించండి. క్షమించండి, దీని వలన మాకు ప్రాధాన్యత ఇవ్వడానికి, నిర్మించడానికి కొంత సమయం పట్టింది. ఇది బహుళ సిస్టమ్‌లు, మైక్రోసర్వీస్‌లను తాకిందని చెబుతూ ట్వీట్ చేసే సమయానికి ఫీచర్ లైవ్ చేసినట్లు పేర్కొన్నారు.
వినియోగదారుల నుంచి అనేక అభ్యర్థనల తర్వాత కరణ్ సింగ్ అనే ట్విట్టర్ వినియోగదారుని నుంచి హాస్యాస్పదమైన అభ్యర్థనతో సహా, అతని ఆర్డర్ హిస్టరీని తనిఖీ చేయడం ద్వారా అతని భార్య అర్థరాత్రి ఆర్డర్ చేసే అలవాట్లను కనుగొన్నట్లు పేర్కొన్నాడు. అయితే కంపెనీ తన తాజా ఫీచర్ ద్వారా వినియోగదారులకు వారి ఆర్డరింగ్ డేటాపై మరింత నియంత్రణను ఇస్తోంది. వినియోగదారులు నేరుగా 'యువర్ ఆర్డర్స్' ట్యాబ్‌కు వెళ్లడం ద్వారా ఆర్డర్‌లను తొలగించవచ్చని జొమాటో పేర్కొంది.


Click it and Unblock the Notifications