Zomato News: X వేదికగా కస్టమర్లకు జొమాటో రిక్వెస్ట్.. డెలివరీ పార్టనర్స్ కోసం కీలక నిర్ణయం
Delivery agents: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. నిమిషాల వ్యవధిలోని కోరిన ఫుడ్ అందించేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రజలు కూడా రోజువారి ఇంట్లో ఆహారం కాకుండా బయట రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి కొత్త పదార్థాలను రుచి చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే భానుడి ప్రతాపానికి డెలివరీ ఏజెంట్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సదరు డెలివరీ యాప్ నిర్వాహకులు కీలక చర్యలకు తీసుకుంటున్నారు.
ప్రముఖ సంస్థ జొమాటో ఫుడ్ డెలివరీ తో పాటు బ్లింక్ ద్వారా క్విక్ కామర్స్ రంగంలోనూ సేవలు అందిస్తుంది. వేలాదిమంది డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ వీటిలో పనిచేస్తున్నారు. ఎండ, వానలకు వెరవకుండా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. వేసవికాలం కావడంతో మధ్యాహ్నం వేళ భారీ ఎండ వేడిమికి తట్టుకోలేక నానా అవస్థలు పెడుతున్నారు. వీటి నుంచి వారికి కొంతైనా ఉపశమనం కల్పించేందుకు సదరు సంస్థ చర్యలు తీసుకుంది.

దేశవ్యాప్తంగా 250 నగరాల్లోని తమ 450 రెస్ట్ పాయింట్లలో డెలివరీ భాగస్వాములకు అందించేందుకు 5 లక్షల యునిట్లకుకు పైగా రిఫ్రెష్‌మెంట్లు, గ్లూకోస్ మరియు జ్యూస్ లను జొమాటో కొనుగోలు చేసింది. అత్యవసర సమయంలో సహాయం కోసం 24x7 సపోర్ట్‌తో పాటు 15 నిమిషాల్లో అంబులెన్స్ సహాయాన్ని అందిస్తోంది. హీట్ వేవ్‌ను సమర్థవంతంగా తట్టుకునేందుకు డెలివరీ ఏజెంట్లకు ఫుల్ స్లీవ్, డ్రై ఫిట్ టీషర్టులను ఇవ్వనున్నట్లు పేర్కొంది.
వీటికి తోడు డెలివరీ సిబ్బందికి ఉపశమనం కలిగించేందుకు రెస్ట్ పాయింట్లలో ఏసీలను సైతం ఏర్పాటు చేసినట్లు జొమాటో X వేదికగా వెల్లడించింది. లక్ష వరకు బీమాతో పాటు సాధారణ వైద్య ఖర్చులకోసం 5 వేల OPD కవర్ అందిస్తున్నట్లు తెలిపింది. మరో అడుగు ముందుకు వేసి ఎండ ఎక్కువగా ఉంటున్న మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప ఆర్డర్స్ పెట్టవద్దని తమ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. మరో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ కూడా ఇదే తన విష్ మాస్టర్లకు పలు సౌకర్యాలు కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications