ఐపీవోకి జొమాటో, ఆ ఉద్యోగులకు 30 మిలియన్ డాలర్ల ఈసాప్స్
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతోంది. 2021 ప్రథమార్థంలో ఐపీవోకీ వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ సందేశంలో కంపెనీ కో-ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నాటికి ఐపీవోకీ రావొచ్చునని వెల్లడించారు. ఇప్పటికే నిధుల్ని భారీ స్థాయిలో సేకరించామని, తాజాగా టైగర్ గ్లోబల్, టెమాసక్, బైలీ గియార్డ్, యాంట్ ఫైనాన్షియల్ వంటి సంస్థలు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు.
వ్యాపార వ్యాల్యూ గణనీయంగా పెరుగుతోందని, ఉద్యోగుల కృషి, పట్టుదలకు కృతజ్ఞతలు అని ఉద్యోగులకు రాసిన ఈ మెయిల్ సందేశంలో పేర్కొన్నారు. ఉద్యోగులకు మరింత విలువ చేకూర్చే విధంగా వచ్చే ఏడాది ఈసాప్స్ ఇవ్వనున్నామని, ఐపీవోతో సంస్థ మరింతగా పెరుగుతుందని తెలిపారు. మాజీ ఉద్యోగులకు 30 మిలియన్ షేర్ సేల్ ఆఫర్ ఇవ్వనుంది. ప్రీ-ఐపీవో రౌండ్‌లో జొమాటో 600 మిలియన్ డాలర్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో 100 మిలియన్ డాలర్లు టైగర్ గ్లోబల్ ద్వారా సమీకరించింది. దీని కంటే ముందు సింగపూర్‌కు చెందిన టెమ్‌సెక్, చైనాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్, యూకే ఆధారిత బెయిల్లీ గిఫోర్డ్ నుండి 150 మిలియన్ డాలర్లు సమీకరించింది.

మరో రౌండ్ నిధుల సమీకరణ ద్వారా కంపెనీ వ్యాల్యూయేషన్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో జొమాటోతో పాటు రైవల్ స్విగ్గీ రెవెన్యూ కూడా పడిపోయింది. అయితే గత నెలలో కరోనా ముందు బిజినెస్‌లో 75 శాతం నుండి 80 శాతానికి చేరుకున్నట్లు జొమాటో తెలిపింది. జొమాటో స్టార్టప్‌ను 2008లో దీపిందర్ గోయల్.. పంకజ్ చఢాతో కలిసి స్థాపించారు.


Click it and Unblock the Notifications