Zomato News: సాంకేతిక విప్లవంతో ప్రస్తుతం దేశంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. అలాగే సామాజిక మాధ్యమాల కారణంగా ఆ విషయాలు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం క్షణాల్లో చేరిపోతున్నాయి.
తాజాగా దేశ రాజధాని నగరమైన దిల్లీ జీటీబీ నగర్ నడివీధిలో ఒక జొమాటో డెలివరీ బ్యాయ్ ఏడవటం వైరల్ అయ్యింది. దీనిపై డెలివరీ వర్కర్ ఒకరిని ఆరా తీస్తే.. జొమాటో తన ఖాతాను బ్లాక్ చేసిందని, అది తన సోదరి పెళ్లిపై ప్రభావం చూపుతుందని చెప్పాడు. దీనిని సోహం భట్టాచార్య జొమాటో డెలివరీ వర్కర్ చిత్రాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారంలో సూపర్ వైరల్ అయ్యింది.

మరికొద్ది రోజుల్లో జొమాటో ఉద్యోగి సోదరి పెళ్లి జరగనుందని భట్టాచార్య తన పోస్ట్‌లో రాశారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగి ఖాతాను జొమాటో బ్లాక్ చేసిందని చెప్పుకొచ్చారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో డెలివరీ బాయ్ జీటీబీ సిటీ సమీపంలోని రోడ్డుపై నిలబడి ఏడుస్తున్నాడని వెల్లడించారు. సదరు వ్యక్తి తన సమస్యను చెప్పుకుంటూ ఆ దారిలో వెళుతున్న వారిని సహాయం చేయాలని డబ్బు అభ్యర్థిస్తున్నట్లు, తాను తినలేదని, చెల్లి పెళ్లి కోసం డబ్బు పొదుపు చేశాడని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భట్టాచార్య పోస్ట్‌ను వైరల్ చేయాలని అభ్యర్థించారు. పోస్ట్ వైరల్ కావటంతో 3.3 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఈ పోస్టుపై ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో సైతం స్పందించింది. తమ డెలివరీ భాగస్వాములను గౌరవిస్తున్నామని, సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీనిపై శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా డెలివరీ భాగస్వాములు మాకు మా కస్టమర్‌లు ఎంత ముఖ్యమో జొమాటో వివరించింది.
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో సామాన్యులు సైతం స్పందించారు. ఇది నిజంగా జొమాటో సిగ్గులేని ప్రవర్తనని, ఈ వికృత ప్రవర్తన సరికాదంటూ ఒక వ్యక్తి పోస్ట్ చేశారు. మరొకరు స్పందిస్తూ ఎక్స్ కుటుంబం అతడికి సాయం చేస్తుందని, తన సోదరి వివహానికి ఉత్తమ ఏర్పాటు జరుగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరొకరైతే తాను ఇకపై జొమాటోను వినియోగించనని, స్విగ్గీలో ఆర్డర్ చేస్తానని ప్రకటించారు.


Click it and Unblock the Notifications