మంగళవారం భారీగా పెరగనున్న Paytm-Zomato స్టాక్స్.. ఇన్వెస్టర్స్ గెట్ రెడీ..!!
Paytm-Zomato News: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం చాలా మంది జొమాటో, పేటీఎం కంపెనీల షేర్ల గురించి చర్చిస్తున్నారు. ఈ రెండు కంపెనీల మధ్య జరుగుతున్న చర్చలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. నిన్నటి నుంచి జొమాటో పేటీఎంకు చెందిన టిక్కెట్ అండ్ సినిమాల వ్యాపారాన్ని కొనుగోలు చేయగలదని బలమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వార్తను రెండు కంపెనీలు కూడా ధృవీకరించాయి. ఈ వ్యవహారంలో పేటీఎంతో చర్చలు జరుపుతున్నట్లు జొమాటో ధృవీకరించింది. జొమాటో ఈ సమాచారాన్ని ఎక్స్ఛేంజ్‌తో పంచుకుంది. ఈ లావాదేవీకి సంబంధించి పేటీఎంతో చర్చలు జరుపుతున్నామని జొమాటో ఎక్స్ఛేంజ్‌కి తెలిపింది.

అయితే ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేకపోయినట్లు దీపేంద్ర గోయల్ నేతృత్వంలోని కంపెనీ తెలిపింది. మరోవైపు పేటీఎం సైతం చర్చలకు సంబంధించి స్టాక్ మార్కెట్లకు సమాచారం అందించింది. అయితే పేటీఎం తన ప్రకటనలో జొమాటో పేరును ప్రస్థావించలేదు. పేటీఎం చెల్లింపులు, ఆర్థిక సేవలపై తన దృష్టిని పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. అయితే దీనికి ముందు బ్లూమ్‌బెర్గ్ నివేదికలో పేటీఎం తన సినిమాలు అండ్ టిక్కెట్ వ్యాపారాన్ని Zomatoకి విక్రయించవచ్చని పేర్కొంది. అమ్మకాలు క్షీణించడం వల్ల పేటీఎం ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని వెల్లడించింది.
కొన్ని నెలల కిందట సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ పేటీఎం వ్యాపారంపై తీసుకున్న కఠిన నిర్ణయంతో ఫిన్ టెక్ స్టార్టప్ కోలుకోలోని స్థాయిలో దెబ్బతిన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో తన వ్యాపారాలను విస్తరించడంలో నిరంతరం బిజీగా ఉంది. కంపెనీ తన అనుబంధ సంస్థ బ్లింకిట్‌లో మరో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది.
దీంతో బ్లింకిట్‌లో జొమాటో మొత్తం పెట్టుబడి రూ.2300 కోట్లకు చేరుకోనుంది. దీనికి ముందు శుక్రవారం నాడు జొమాటో స్టాక్ ధర స్వల్ప లాభంతో రూ.186.19 వద్ద ముగియగా గడచిన ఏడాది కాలంలో స్టాక్ ధర 50 శాతం వృద్ధిని సాధించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రభావం మంగళవారం పేటీఎం, జొమాటో కంపెనీల షేర్లపై ఉండనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications