ఫుడ్ టెక్ ప్లాట్‌ఫామ్ జొమాటోకు సంబంధించి బిగ్ డెవలప్‌మెంట్. జొమాటో టాప్ ఎగ్జిక్యూటివ్స్‌లో ఒకరైన గౌరవ్ గుప్తా (కో-ఫౌండర్) తప్పుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన కంపెనీని వీడుతున్నారనే వార్త రావడం గమనార్హం. గౌరవ్ గుప్తా జొమాటోలో 2015లో జాయిన్ అయ్యారు. 2018లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) స్థాయికి ఎదిగారు. 2019లో ఫౌండర్ అయ్యారు. జొమాటో ఇటీవలే ఐపీవోకు వచ్చింది. అప్పుడు పెట్టుబడిదారులు, మీడియాతో ప్రముఖంగా మాట్లాడింది అతనే. జొమాటో గ్రాసరీ డెలివరీ, న్యూట్రాస్యూటికల్ బిజినెస్ నుండి నిష్క్రమించనుంది.
ఈ వ్యాపారం నుండి నిష్క్రమించిన అనంతరం అతని ఎగ్జిట్ ఉంటుందని తెలుస్తోంది. కిరాణా డెలివరీ సేవలను నిలిపివేసిన తర్వాత జొమాటో న్యూట్రాస్యూటికల్ బిజినెస్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది. జొమాటో గత ఏడాది ఆరోగ్య, ఫిట్‌నెస్ ఉత్పత్తుల ప్రారంభంతో న్యూట్రాస్యూటికల్ బిజినెస్‌లోకి అడుగు పెట్టింది. దేశంలో మార్కెట్ వ్యాపారాల కోసం ప్రయివేటు లేబుల్ నిబంధనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైన సమయంలో కంపెనీ దీనిని మూసివేయాలని నిర్ణయించింది.

ఇటీవలే లిస్టింగ్
జొమాటో ఇటీవలే లిస్టింగ్‌కు వచ్చింది. జూన్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో రూ.356 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.99.8 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.916 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.283.5 కోట్ల ఆదాయంతో పోలిస్తే భారీగా పెరిగింది.
ప్రస్తుతం జొమాటో షేర్ ధర రూ.144.30 వద్ద ఉంది. నేడు ఈ స్టాక్ దాదాపు 2 శాతం లాభపడింది. క్రితం సెషన్‌లో రూ.143.15 వద్ద ముగిసింది. ఈ స్టాక్ రూ.152 వద్ద గరిష్టాన్ని, రూ.115 వద్ద కనిష్టాన్ని తాకింది. స్టాక్ లాంచింగ్ నుండి 18 శాతానికి పైగా లాభపడింది.

నాటి నుండి రెండింతలు పెరిగిన షేర్
జొమాటో షర్ ధర ఇటీవల మంచి వృద్ధిని నమోదు చేసింది. మంగళవారం రూ.152.75 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఈ స్టాక్ ఐపీవో ఇష్యూ ధర రూ.76 కాగా, రెండింతలు పెరిగింది. లిస్టింగ్ ధర రూ.116 కాగా, అప్పటి నుండి 31 శాతం ఎగిసింది. జొమాటో షేర్ మరింత జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. జొమాటో స్టాక్ టార్గెట్ ధరను క్రెడిట్ సూసీ రూ.185గా పేర్కొంది. FY20 నుండి FY30 కాలంలో ఇండియా ఫుడ్ డెలివరీ మార్కెట్ 30 శాతం CAGR ఉంటుందని బ్రోకరేజీ సంస్థ అంచనా వేస్తోంది.

నిత్యావసరాల డెలివరీ బంద్
ఇదిలా ఉండగా, ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే హోటల్స్ నుండి ఫుడ్ సరఫరా చేసే జొమాటో, నిత్యావసరాల సరఫరా సేవలను ఈ నెల 17వ తేదీ నుండి నిలిపివేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా గత ఏడాదిలో ప్రయోగాత్మకంగా నిత్యావసరాల సరఫరాను కూడా ప్రారంభించింది. కరోనా తీవ్రత తగ్గి, ఆహార పదార్థాలకు మళ్లీ ఆర్డర్స్ పెరగడం, అలాగే, ఆర్డర్స్‌కు తగినంత వేగంగా నిత్యావసరాలు అందించలేక పోతుండటం వల్ల దీని నుండి తప్పుకుంటున్నట్లు తెలిపింది.
ఎంపిక చేసిన నగరాల్లో 45 నిమిషాల్లోనే నిత్యావసరాలు అందించే సేవను ఈ ఏడాది జులైలో తిరిగి ప్రారంభించింది. జొమాటో గత ఏడాది నుండి నిత్యావసరాల సేవ నుండి తప్పుకోవడం రెండోసారి. నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో దాదాపు రూ.745 కోట్లు పెట్టుబడి పెట్టి, మైనార్టీ వాటాను దక్కించుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్‌డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications